ఢిల్లీలో ఇల్లు లేని కిషన్ రెడ్డి.. ఆంధ్రాభవన్ నుంచే విధులు..

మాజీ ఎంపీలందరూ తక్షణం ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని గత నెల కేంద్రం ఆదేశించింది. ఇందుకోసం ఏడు రోజుల డెడ్ లైన్ కూడా విధించింది. అయినా ఎంపీలెవరూ బంగ్లాలను వీడలేదు.

news18-telugu
Updated: September 20, 2019, 12:31 PM IST
ఢిల్లీలో ఇల్లు లేని కిషన్ రెడ్డి.. ఆంధ్రాభవన్ నుంచే విధులు..
కిషన్ రెడ్డి (File)
  • Share this:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా.. కిషన్ రెడ్డికి ఢిల్లీలో ఇంతవరకు అధికారిక భవనం కేటాయించలేదు. దీంతో ఆంధ్రాభవన్‌ నుంచే ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.నిజానికి కిషన్ రెడ్డికి రెండు బంగ్లాలను కేటాయించినప్పటికీ.. పాత మంత్రులు ఇంకా వాటిని ఖాళీ చేయలేదు. నిబంధనల ప్రకారం లోక్‌సభ రద్దయిన నెల రోజుల లోపు ఎంపీలు బంగ్లాలు ఖాళీ చేయాలి. అంటే 16వ లోక్‌సభ మే 25న రద్దవగా..ఎంపీలు జూన్ 25న బంగ్లాలు ఖాళీ చేయాల్సింది. కానీ ఇప్పటివరకు వారు బంగ్లాలు ఖాళీ చేయలేదు.

కిషన్ రెడ్డికి మొదట తుగ్లక్ క్రెసెంట్ రోడ్‌లో బంగ్లాను కేటాయించారు.అయితే ఇప్పటికీ అది మాజీ కేంద్రమంత్రి జయంత్ సిన్హా ఆధీనంలోనే ఉంది. తనకు వేరే బంగ్లాను కేటాయించాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో పాత బీజేపీ హెడ్‌క్వార్టర్స్ ఎదురుగా ఉన్న అశోకా రోడ్‌లో ఆయనకు బంగ్లాను కేటాయించారు. అయితే ఆ బంగ్లాలో బీజేపీ సీనియర్ నేత రాధామోహన్ సింగ్ ఉంటున్నారు. దాంతో జయసిన్హా క్రెసెంట్ రోడ్‌లోని బంగ్లాలోనే ఉండిపోవడంతో కిషన్ రెడ్డికి ఇల్లు లేకుండా అయింది.

మాజీ ఎంపీలందరూ తక్షణం ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని గత నెల కేంద్రం ఆదేశించింది. ఇందుకోసం ఏడు రోజుల డెడ్ లైన్ కూడా విధించింది. డెడ్‌లైన్ గడువు దగ్గరపడ్డాక చివరి మూడు రోజులు నీళ్లు,కరెంట్ నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది.బంగ్లాలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇలా ఎన్నిసార్లు కోరుతున్నా.. మాజీ ఎంపీలు మాత్రం అందులో నుంచి కదలడం లేదు. ఫలితంగా కిషన్ రెడ్డి లాంటి కేంద్రమంత్రికే ఢిల్లీలో ఇల్లు కరువైంది.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading