టీఆర్ఎస్ ఫంక్షన్‌లా చేస్తారా ?... మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్

మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఫంక్షన్ లాగా చేస్తారా ? అంటూ మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి మండిపడ్డారు.

news18-telugu
Updated: February 15, 2020, 3:28 PM IST
టీఆర్ఎస్ ఫంక్షన్‌లా చేస్తారా ?... మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్
మెట్రో అధికారులు, కిషన్ రెడ్డి(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మెట్రో అధికారులతో జరిగిన సమీక్షలో పాల్గొన్న కిషన్ రెడ్డి... వారి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తన నియోజకవర్గ పరిధిలో మెట్రో రైలు ప్రారంభోత్సవం జరిగితే... స్థానిక ఎంపీ అయిన తనకే సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న తాము ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని... కానీ ప్రధాని నరేంద్రమోదీ ఫోటో మాత్రం ఉండదని ఆయన ఫైర్ అయ్యారు. తనకు పార్లమెంట్‌లో విప్ ఉందని... కచ్చితంగా సమావేశాలకు హాజరుకావాలని తెలిపారు.

మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఫంక్షన్ లాగా చేస్తారా ? అంటూ మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అనంతరం ఆయన పలువురు బీజేపీ నేతలతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్, రాంచందర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు మెట్రో రైలులో ప్రయాణించిన వారిలో ఉన్నారు.

కొద్ది రోజుల క్రితం జూబ్లి బస్టాండ్ - మహాత్మాగాంధీ బస్టాండ్ మధ్య నిర్మించిన మెట్రో కారిడార్‌ అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ మెట్రో రైల్ కారిడార్‌ను ప్రారంభించారు. పచ్చ జెండా ఊపిన సీఎం కేసీఆర్ రైలును ప్రారంభించారు. ఈ మార్గం మొత్తం 11 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ చేరుకుంటుంది. 16 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోనే అతి పెద్ద రెండో మెట్రోగా ఆవిర్భవించనుంది. అయితే ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించకపోవడంపై బీజేపీ అసంతృప్తితో ఉంది.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading