రాజీనామాకు సిద్ధమైన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్

తన కుమారుడికి ఎంపీ టికెట్ దక్కడంతో తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టు బీరేంద్ర సింగ్ తెలిపారు.

news18-telugu
Updated: April 14, 2019, 9:31 PM IST
రాజీనామాకు సిద్ధమైన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్
చౌదరి బీరేంద్ర సింగ్
  • Share this:
కేంద్ర మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. కేంద్ర మంత్రి పదవితో పాటు రాజ్యసభ ఎంపీ పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. చౌదరి బీరేంద్ర సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్‌కు బీజేపీ టికెట్ దక్కింది. హర్యానాలోని హిసార్ లోక్‌సభ స్థానం నుంచి బ్రిజేంద్ర సింగ్ పోటీ చేయనున్నారు. దీంతో వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే బీజేపీ, ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఎలా టికెట్లు, పదవులు ఇస్తుందంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం కలిగింది. దీంతో ముందస్తుగానే తాను రాజీనామాకు సిద్ధమని బీరేంద్ర సింగ్ ప్రకటించారు. ‘వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. నా కొడుక్కి టికెట్ ఖరారైంది కాబట్టి, నేను రాజీనామా చేస్తానని పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకి లేఖ రాశాను. పార్టీ నిర్ణయాన్ని పాటిస్తా. నేను రాజీనామా చేసేందుకు సిద్ధం.’ అని బీరేంద్ర సింగ్ ఏఎన్‌ఐ వార్తాసంస్థకు తెలిపారు. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేసే 20 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. ఆ జాబితాలో హర్యానా నుంచి ఇద్దరి పేర్లు ఉన్నాయి.

First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...