UNION MINISTER AJAY MISHRA HAS TRIED TO EXPLAIN THAT HIS SON WAS NOT AT THE SCENE OF THE LAKHIMPUR KHERI INCIDENT AS ALLEGED BY SOME FARMER LEADERS PRV
Lakhimpur: లఖింపూర్ కారు ఘటనలో తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా.. ఏం అన్నారంటే?
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా (Photo: ANI)
కొంతమంది రైతు నాయకులు ఆరోపించినట్లుగా తన కుమారుడు (his son) లఖింపూర్ ఖేరి సంఘటన స్థలంలో లేడని (not present at place) మిశ్రా వివరించే ప్రయత్నం చేశారు. అయితే తన కొడుకు అక్కడ లేడని నిరూపించడానికి తన వద్ద ఫోటో, వీడియో ఆధారాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని లఖింపూర్ ఖేరి (Lakhimpur kheri) ఘటనలో తన కొడుకు (son) అక్కడ లేడని కేంద్రమంత్రి (Union Minister) అజయ్ మిశ్రా (Ajay Mishra) అన్నారు. లఖింపూర్ ఖేరీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను కొందరు బీజేపీ (BJP) కార్యకర్తలు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు మంత్రి అజయ్ మిశ్రా. అయితే నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల్లో కొందరు ముగ్గురు బీజేపీ కార్యకర్తలను, కారు డ్రైవర్ (car driver)ని పొట్టన బెట్టుకున్నారని ఆరోపించారు. ఈ ప్రమాదంలో కారు కింద పడి ఇద్దరు రైతులు (farmers) మరణించడం దురదృష్టకరమన్నారు కేంద్రమంత్రి.
కారుపై రైతులు రాళ్లు రువ్వారు..
నిరసన తెలుపుతున్న రైతుల్లో కొంతమంది నల్ల జెండాలు (black flags) చూపించారని కేంద్రమంత్రి అజయ్ తెలిపారు. అనంతరం వారు కారుపై రాళ్లు (stones) రువ్వడంతో కారు అదుపు తప్పి బోల్తాపడిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలో ఇద్దరు రైతులు కారు కింద పడటంతో మరణించారని ఆయన వివరించారు. అంతేకాదు అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ముగ్గురు బీజేపీ కార్యకర్తలను (BJP leaders), కారు డ్రైవర్ని అనవసరంగా కొట్టి చంపారని ఆరోపించారు. పోస్టుమార్టం (post mortem)లో అసలు విషయాలు తెలుస్తాయని మంత్రి అన్నారు. కొంతమంది రైతు నాయకులు ఆరోపించినట్లుగా తన కుమారుడు (his son) సంఘటన స్థలంలో లేడని (not present at place) మిశ్రా వివరించే ప్రయత్నం చేశారు.
#WATCH: We had this info that some farmers were peacefully protesting...Our route was diverted. During the same time, some unruly elements hidden among farmers attacked BJP workers' cars with lathis. We have a video of it...: MoS Home Ajay Mishra Teni
అయితే తన కొడుకు అక్కడ లేడని నిరూపించడానికి తన వద్ద ఫోటో, వీడియో ఆధారాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ఘటన జరిగే సమయంలో తన కుమారుడు ఉప ముఖ్యమంత్రి వేదిక వద్ద ఉన్నారని, వేలాది మంది ప్రజలు, పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు యునైటెడ్ కిసాన్ మోర్చా (SKM) ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా జిల్లా మెజిస్ట్రేట్లు, కమిషనర్ల కార్యాలయం ఎదుట ప్రదర్శనకు పిలుపునిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై రైతు నాయకులు యోగేంద్ర యాదవ్, దర్శన్ పాల్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
I was at Banwaripur since 9 am till the end of the event. Allegations against me are completely baseless & I demand judicial inquiry of this matter and culprits should get punished: Ashish Mishra, son of MoS Home Ajay Mishra Teni on Lakhimpur Kheri incident pic.twitter.com/GCYbae03y3
నేను అసలు అక్కడ లేను.. : కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా
లఖింపూర్ ఖేరీ ఘటనపై మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా స్పందిస్తూ.. ‘‘ నేను ఉదయం 9 గంటల నుంచి ఈవెంట్ ముగిసే వరకు బన్వారిపూర్లో ఉన్నాను. నాపై ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి , ఈ విషయంపై న్యాయ విచారణ జరిపించాలని నేరస్థులను శిక్షించాలని నేను కోరుతున్నాను”అని అన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.