Home /News /politics /

Amit Shah: తెలంగాణకు అమిత్ షా.. నిర్మల్‌లో భారీ సభ.. కీలక ప్రకటన ?

Amit Shah: తెలంగాణకు అమిత్ షా.. నిర్మల్‌లో భారీ సభ.. కీలక ప్రకటన ?

అమిత్ షా (ఫైల్ ఫోటో)

అమిత్ షా (ఫైల్ ఫోటో)

Amit Shah: సెప్టెంబర్ 17న అమిత్ షా రాష్ట్రానికి రానుండటంతో.. ఆయన నిర్మల్ సభ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు.

    తెలంగాణలో రాజకీయంగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఇందుకోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారు. ఇప్పటికే ఆయన పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. తన పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్న బండి సంజయ్.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీకి ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడా పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతోంది. అప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలతో పాటు జాతీయ నేతలు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న అమిత్ షాను రాష్ట్రానికి తీసుకొచ్చి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించింది రాష్ట్ర నాయకత్వం. తాజాగా ఇందుకు అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

    సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పదే పదే డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా అదే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్మల్ చేరుకునేలా బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. అలా ఆ రోజు నిర్మల్‌లోని వెయ్యి ఊడలమర్రి దగ్గర సభ పెట్టాలని బీజేపీ నిర్ణయించింది.

    చారిత్రాత్మకంగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఉండటంతో.. ఇక్కడే సభ పెట్టాలని బీజేపీ డిసైడయ్యింది. సెప్టెంబర్ 17న అమిత్ షా రాష్ట్రానికి రానుండటంతో.. ఆయన నిర్మల్ సభ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని నిర్మల్ సభ వేదికపై నుంచి అమిత్ షా ప్రకటన చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

    మరోవైపు తెలంగాణలో బీజేపీని మరింతగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ ముఖ్యనేతలతో చర్చించే అవకాశం ఉంది. పాదయాత్రకు వస్తున్న స్పందనను తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షాకు వివరించనున్నారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తరువాత.. అక్కడే సెప్టెంబర్ 17న సభ పెట్టి అమిత్ షాను ఆహ్వానించాలని బీజేపీ గతంలో నిర్ణయించింది. అయితే ఈ ఉప ఎన్నిక వాయిదా పడింది. దీంతో బీజేపీ ఇప్పుడు పూర్తిస్థాయిలో సెప్టెంబర్ 17పై ఫోకస్ చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amit Shah, Bandi sanjay, Bjp, Nirmal, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు