• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • UNION HOME MINISTER AMIT SHAH SUGGESTION TO HYDERABAD MP ASADUDDIN OWAISI AK

వినడం నేర్చుకోండి... అసదుద్దీన్‌పై అమిత్ షా ఆగ్రహం

వినడం నేర్చుకోండి... అసదుద్దీన్‌పై అమిత్ షా ఆగ్రహం

అమిత్ షా(ఫైల్ ఫోటో)

బీజేపీ ఎంపీ సత్యపాల్ మాట్లాడుతున్న సమయంలో పదే పదే అసదుద్దీన్ ఓవైసీ అడ్డు తగలడంపై అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 • Share this:
  లోక్ సభలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీరు పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) బిల్లు సవరణలపై చర్చ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ సత్యపాల్ మాట్లాడుతున్న సమయంలో పదే పదే అసదుద్దీన్ ఓవైసీ అడ్డు తగలడంపై అమిత్ షా ఈ రకంగా స్పందించారు. అసదుద్దీన్ ఓవైసీ పదే పదే బీజేపీ సభ్యుడి ప్రసంగానికి అడ్డు తగులుతున్నారని... ఇది మంచి పద్ధతి కాదని అమిత్ షా అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ వినడం కూడా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ రకమైన తీరు సభలో సాగదని ఒకింత ఆగ్రహంతో వ్యాఖ్యానించారు.
  ఇదిలా ఉంటే చర్చ అనంతరం సోమవారం ఎన్ఏఐ సవరణల బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.
  First published:

  అగ్ర కథనాలు