Amit Shah: కేసీఆర్ డిమాండ్ ఏమైంది ?.. కారు స్టీరింగ్ ఆయన చేతుల్లోనే ఉందన్న అమిత్ షా

అమిత్ షా (ఫైల్ ఫోటో)

Amit Shah in Telangana: మజ్లిస్ గుప్పిట్లో లేని ప్రభుత్వాన్ని తెలంగాణలో కేవలం బీజేపీ మాత్రమే ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

  • Share this:
    సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పట్లో కేసీఆర్ డిమాండ్ చేశారని కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షా గుర్తు చేశారు. ఇప్పుడు ఆ డిమాండ్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. నిర్మల్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. టీఆర్ఎస్, ఎంఐఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విమోచన దినోత్సవాన్ని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని.. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో 2024 బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అధికారంలోకి వచ్చిన తరువాత అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. సర్ధార్ పటేల్ సైనిక చర్య వల్లే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని అన్నారు.

    కాంగ్రెస్ పార్టీ దేశంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని అమిత్ షా అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని కాంగ్రెస్ కాదని అమిత్ షా అన్నారు. తెలంగాణ పగ్గాలు చేపట్టే సామర్థ్యం బీజేపీకే ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు. మజ్లిస్ పెత్తనం లేని ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అవుతుందని తెలిపారు. తెలంగాణ సమస్యలు తెలుసుకునేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచామని... మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని అమిత్ షా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

    Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కీలక పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్

    YS Jagan: 2024 ఎన్నికల ప్లాన్ బయటపెట్టిన సీఎం జగన్.. మంత్రులతో కీలక వ్యాఖ్యలు..

    తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని అమిత్ షా అన్నారు. మజ్లిస్ గుప్పిట్లో లేని ప్రభుత్వాన్ని తెలంగాణలో కేవలం బీజేపీ మాత్రమే ఏర్పాటు చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా అన్నారు. అంతకంటే ముందు రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఉప ఎన్నికల్లో డబ్బుతో విజయం సాధించవచ్చిన టీఆర్ఎస్ భావిస్తోందని.. కానీ ప్రజలు ఈటల రాజేందర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
    Published by:Kishore Akkaladevi
    First published: