Home /News /politics /

UNION HEALTH MINISTER HARSHAVARDHAN RESIGNED TO HIS POST AHEAD OF CABINET RESHUFFLE AK

Cabinet Reshuffle: మరో కేంద్రమంత్రి రాజీనామా.. ఇప్పటివరకు ఎంతమంది రాజీనామా చేశారంటే..

హర్షవర్ధన్ (ఫైల్ ఫోటో)

హర్షవర్ధన్ (ఫైల్ ఫోటో)

Cabinet Reshuffle: కేబినెట్ విస్తరణకు ముందు పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

    కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందు పలువురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ రాజీనామా చేశారు. ఆ వెంటనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తంగా ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. నేడు సాయంత్రం కేబినెట్ విస్తరణ ఉండటంతో.. మొత్తం ఎంతమందికి చోటు దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.



    భారీ ఎత్తును కొత్తవారికి కేబినెట్‌లో ఛాన్స్ ఇవ్వాలని ప్రధాని మోదీ భావించారు. దీంతో పాటు కొంతమందిని కేబినెట్ నుంచి తప్పించాలని నిర్ణయించారు. పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటివరకు ఏడుగురు మంత్రులు రాజీనామా చేయడంతో.. సాయంత్రంలోపు ఇంకెంతమంది తమ పదవులకు రాజీనామా చేస్తారో అనే చర్చ జరుగుతోంది. కేబినెట్‌ నుంచి పలువురు తప్పుకోవడంతో దాదాపు 40 మందికిపైగా కొత్తవారికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చనే టాక్ వినిపిస్తోంది.



    పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ఇవాళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మోదీ కొత్త టీమ్‌లో యువ నేతలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు పెద్ద పీట వేసినట్లు సమాచారం. బీసీలకు 27, ఎస్టీలకు 17, ఎస్టీకి 7 పదవులు కేటాయించినట్లు సమాచారం. ఇద్దరు బుద్దిస్ట్‌లు, ఒక ముస్లిం, ఒక సిక్కు,ఒక క్రిస్టియన్‌కు కలిపి మొత్తం 5 మంత్రి పదవులను మైనారిటీలకు కేటాయించారు. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి, అనుప్రియ పటేల్, అజయ్ భట్, శోభా కరంద్లాజే, సునీత దుగ్గ, శంతను ఠాకూర్, ప్రీతమ్ ముండే, నారాయణ్ రాణె, కపిల్ పాటిల్, పశుపతి నాథ్ పరాస్, ఆర్సీపీ సింగ్, కిషన్ రెడ్డి, పురుషోత్తం రూపాల, అశ్విని వైష్ణవ్, మన్‌సుఖ్ ఎల్.మాండవీయ, హర్దీప్ పూరి, రాజీవ్ చంద్రశేఖర్, బీఎల్ వర్మ, నిశిత్ ప్రమాణిక్, ప్రతిభ భౌమిక్, డాక్టర్ భారతి పవార్, భగవత్ కరాడ్, ఎస్పీ సింగ్ బఘేల్ ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Cabinet Reshuffle, Central cabinet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు