ప్రధానిగా మరోసారి మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఇదే...

PM Narendra Modi's swearing-in ceremony | మే 26న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మోదీని ప్రధానిగా ఎన్నుకొంటారు. మే 30న సాయంత్రం 5 గంటలకు నరేంద్ర మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు.

news18-telugu
Updated: May 24, 2019, 11:15 AM IST
ప్రధానిగా మరోసారి మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఇదే...
ప్రధానిగా మరోసారి మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఇదే... (Image: PTI)
  • Share this:
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయాన్ని అందుకుంది. బీజేపీ కూడా 300 మార్క్‌ను దాటింది. ఇక ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. 16వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కేంద్ర కేబినెట్ సిఫార్సు చేస్తుంది. మే 26న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మోదీని ప్రధానిగా ఎన్నుకొంటారు. మే 30న సాయంత్రం 5 గంటలకు నరేంద్ర మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. 2014లో ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధిపతులందర్నీ ఆహ్వానించారు నరేంద్ర మోదీ. మరి ఈసారి ఎవరెవర్ని ఆహ్వానిస్తారన్న స్పష్టత రావాల్సి ఉంది.

2014లో మే 16న ఫలితాలు వెలువడితే మే 26న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3 వరకు ఉంది. అంతకంటే ముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఎన్డీఏ. కేబినెట్ తీర్మానం అందుకున్న తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ ప్రస్తుత లోక్‌సభను రద్దు చేస్తారు. లోక్‌సభను రద్దు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది.

నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి


ఇవి కూడా చదవండి:

LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

Railway Recruitment: రైల్వేలో గూడ్స్ గార్డ్, జేఈ, స్టేషన్ మాస్టర్ పోస్టులు... మొత్తం 749 ఖాళీలు

SSC MTS Jobs: 10,000 పోస్టులు... ఇప్పటికే 25 లక్షల దరఖాస్తులు... మే 29 చివరి తేదీ
First published: May 24, 2019, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading