Home /News /politics /

UNION CABINET RESHUFFLE HERE IS THE LIST OF NEW MINISTERS CURRENTLY AT 7 LOK KALYAN MARG SK

Cabinet Reshuffle: ప్రధాని మోదీ నివాసంలో కాబోయే మంత్రులు.. కొత్త మంత్రుల జాబితా ఇదే

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్, కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి దేబశ్రీ చౌధురి, రావ్ సాహెబ్ ధన్వే పాటిల్, సంజయ్ ధోత్రే రాజీనామా చేశారు.

ఇంకా చదవండి ...
    కేంత్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకణకు సర్వం సిద్ధమయింది. కాబోయే మంత్రులకు ఇప్పటికే ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందించింది. వారంతా ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని నివాసంతో నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.  22 మంది కొత్త వారికి ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చిన్నట్లు సమాచారం.  పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మోదీ కొత్త టీమ్‌లో యువ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మహిళలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు పెద్ద పీట వేసినట్లు సమాచారం. బీసీలకు 27, ఎస్టీలకు 17, ఎస్టీకి 7 మంత్రి పదవులు కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇద్దరు బుద్దిస్ట్‌లు, ఒక ముస్లిం, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్‌కు కలిపి మొత్తం 5 మంత్రి పదవులను మైనారిటీలకు కేటాయించారు.

    కేంద్రమంత్రులుగా నేడు ప్రమాణస్వీకారం చేయబోయే నేతలు వీళ్లే:
    1. జ్యోతిరాదిత్య సింధియా

    2. సర్బానంద సోనోవాల్

    3. భూపేంద్ర యాదవ్

    4. అనురాగ్ ఠాకూర్

    5. మీనాక్షి లేఖి

    6. అనుప్రియ పటేల్

    7. అజయ్ భట్

    8. శోభా కరంద్లాజే

    9. సునీత దుగ్గల్

    10. శంతను ఠాకూర్

    11. ప్రీతమ్ ముండే

    12. నారాయణ్ రాణె

    13. కపిల్ పాటిల్

    14. పశుపతి నాథ్ పరాస్

    15. ఆర్సీపీ సింగ్

    16. కిషన్ రెడ్డి

    17. పురుషోత్తం రూపాల

    18. అశ్విని వైష్ణవ్

    19. మన్‌సుఖ్ ఎల్.మాండవీయ

    20. హర్దీప్ పూరి

    21. రాజీవ్ చంద్రశేఖర్

    22. బీఎల్ వర్మ

    23. నిశిత్ ప్రమాణిక్

    24. ప్రతిభ భౌమిక్

    25. డాక్టర్ భారతి పవార్

    26. భగవత్ కరాడ్

    27. ఎస్పీ సింగ్ బఘేల్

    28. హీనా గవిట్

    29. విజయ్ సోన్కర్ శాస్త్రి.

    ఇక ప్రస్తుతం హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ప్రమోష్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపురావడంతో ఆయన మోదీ నివాసానికి వెళ్లారు. ఆయన్ను కేబినెట్ మంత్రిగా తీసుకోనున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసిన సహకారమంత్రిత్వశాఖను కేటాయిస్తారని తెలుస్తోంది. అటు ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్, కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి దేబశ్రీ చౌధురి, రావ్ సాహెబ్ ధన్వే పాటిల్, సంజయ్ ధోత్రే రాజీనామా సమర్పించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cabinet Reshuffle, Central cabinet, PM Narendra Modi, Union cabinet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు