కేంద్రం బడ్జెట్ బాగోలేదన్న విజయసాయిరెడ్డి... అద్భుతంగా ఉందన్న మరో వైసీపీ ఎంపీ...

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2020 - 21 ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించి వైసీపీలోని ఇద్దరు ఎంపీలు రెండు రకాల వాదనలు వినిపించారు.

 • Share this:
  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2020 - 21 ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించి వైసీపీలోని ఇద్దరు ఎంపీలు రెండు రకాల వాదనలు వినిపించారు. ఒకరేమో బడ్జెట్ బాగుందని కితాబిస్తే, మరొకరు మాత్రం బాగోలేదని స్పష్టం చేశారు. ఒకరేమో బడ్జెట్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. మరొకరేమో బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇరు నేతలు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ గందరగోళ పరుస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి నిరాశ కల్గించేలా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటే ఆ పార్టీకే చెందిన మరో ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఈ బడ్జెట్ అద్భుంతంగా ఉందని కొనియాడారు.

  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (News18Creative)


  బడ్జెట్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర బడ్జెట్‌ తమకు నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ ఏపీకి బడ్జెట్‌ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదన్న విజయసాయిరెడ్డి... బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని అన్నారు. డిపాజిటర్ల బీమ లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామమని అన్నారు. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇ‍వ్వాలని ఆయన కోరారు.

  Union Budget 2020: కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ అసంతృప్తి | Union budget 2020 Ysrcp mp vijayasai reddy expressed his unhappiness over union budget 2020 ak
  విజయసాయిరెడ్డి (File)


  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం... ఆ విధానంలో స్పష్టత ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ త్వరితగతిన నిధులు కేటాయించాలని కోరారు., వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని... నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించిందని ఆరోపించారు. పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివపక్షతతో చూడటం మంచిది కాదని సూచించారు.

  raghurama krishnamraju
  వైఎస్ జగన్, రఘురామ కృష్ణంరాజు


  ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవని... ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్‌ కూడా ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావించలేదని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో విద్యపై జీఎస్టీ 18% చాలా ఎక్కువన్న విజయసాయిరెడ్డి... మౌలిక వసతులకు బడ్జెట్ ఎలా సమకూరుస్తారనే దానిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఒక కొత్త రైలు ప్రాజెక్టు కూడా ఇచ్చినట్లు మాకు సమాచారం లేదని... ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ పోర్టులను అభివృద్ధికి సరిపడ నిధులు ఇవ్వాలని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ap cm jagan
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్


  ఓ వైపు విజయసాయిరెడ్డి మాత్రం బడ్జెట్ బాగోలేదని కుండబద్దలు కొడితే, మరోవైపు వైసీపీకే చెందిన మరోఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం బడ్జెట్ బాగుందని కితాబిచ్చారు. వ్యవసాయం, త్రాగు నీటికి పెద్ద ఎత్తున్న నిధులు కేటాయించడం సంతోషమన్నారు. ఆక్వా రంగానికి బడ్జెట్‌లో పెద్ద పీఠం వేశారని మెచ్చుకున్నారు. తన నియోజవర్గంలో (పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం) పెద్ద ఎత్తున్న ఆక్వా కల్చర్ ఉందని చెప్పారు. క్రియాశీలకంగా వ్యవహరించి రాష్టానికి అధిక నిధులు తెచ్చుకుంటామని  రఘురామకృష్ణం రాజు చెప్పారు.

  CM YS Jagan
  సీఎం జగన్ (CM YS Jagan).


  రఘురామకృష్ణం రాజు ఎంపీగా గెలిచిన తర్వాత నుంచీ వైసీపీకి కొరకరాని కొయ్యగానే ఉన్నారు. బీజేపీ నేతలతో ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నారంటూ సీఎం జగన్ పిలిచి క్లాస్ పీకినట్టు కూడా ప్రచారం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం తనకు స్టేజ్ మీద సీటు కేటాయించలేదంటూ, ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం నుంచి బాయ్ కాట్ చేశారు. తనను కింద కూర్చోబెట్టి ఓ అధికారిని పైన కూర్చోబెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి సంప్రదాయమే కొనసాగితే ఇకపై ఆ సమావేశాలకు వెళ్లబోనని స్పష్టం చేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: