Budget 2019: ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే... ముందుంది అసలు సినిమా: మోదీ

Union Budget 2019:ప్రజల కోరికల్ని ప్రభుత్వం నెరవేర్చగలిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్ర్యం తర్వాత దేశ చరిత్రలోనే రైతుల కోసం చేసిన పెద్ద కార్యక్రమం ఇదన్నారు.


Updated: February 1, 2019, 4:06 PM IST
Budget 2019: ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే... ముందుంది అసలు సినిమా: మోదీ
నరేంద్ర మోదీ
  • Share this:
కేంద్రమంత్రి పియూష్ గోయల్ తాజాగా పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది తాత్కాలిక బడ్జెట్ మాత్రమే అన్నారాయన. ఇప్పుడు ప్రకటించిన బడ్జెట్ కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు మోదీ. ఎన్నికల తర్వాత అభివద్ధి మంత్రంతో కూడిన బడ్జెట్ అన్నారు మోదీ. ప్రస్తుతం ప్రకటించిన బడ్జెట్ అన్నిరంగాల్లో సంతృప్తి నిచ్చిందన్నారు. ప్రతీ ఒకరికి ఉపయోగపడేలా బడ్జెట్ రూపొందించామన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందన్నారు మోదీ. దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ ముందడుగు అన్నారు.

ప్రజల కోరికల్ని ప్రభుత్వం నెరవేర్చగలిగిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశ చరిత్రలోనే రైతుల కోసం చేసిన పెద్ద కార్యక్రమం ఇదన్నారు. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచామన్నారు. ఎన్నో ఏళ్లుగా వేతన జీవులు కోరుకుంటున్న దానిని మా ప్రభుత్వం చేసి చూపిందన్నారు.స్వచ్ఛ భారత్ ద్వారా 9 కోట్లమందికి ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ బడ్జెట్ 12 కోట్లమంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చిందన్నారు. 3కోట్ల మంది పన్ను చెల్లింపు దారులకు కూడా నేరుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు ప్రధాని.
First published: February 1, 2019, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading