Budget 2019: ఎక్స్‌పైర్ అయిన మందులెందుకు...మోదీపై దీదీ సెటైర్

క్స్‌పెయిరీ అయిపోయిన తర్వాత మెడిసన్ ఇస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ? అని ప్రశ్నించారామె. ఇది పూర్తిగా విలువలేని వ్యర్థ ప్రయోగమన్నారు మమత.

news18-telugu
Updated: February 1, 2019, 4:39 PM IST
Budget 2019: ఎక్స్‌పైర్ అయిన మందులెందుకు...మోదీపై దీదీ సెటైర్
మోదీ, మమత (ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తాత్కాలిక బడ్జెట్ ప్రజల్ని మోసగించేలా ఉందని మండిపడ్డారామె. నైపుణ్యాభివృద్ధి రంగంలో కోతలు విధించారన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల్ని కొత్తగా పేరుమార్చి ప్రకటించారన్నారు మమత. కేంద్రం మా పథకాల్నే కాపీ కొట్టిందని దుయ్యబట్టారు. ఓ చిట్‌ఫండ్ కంపెనీలా కేంద్రం వ్యవహరిస్తుందని ఆమె విమర్శించారు. సమాఖ్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం బంగాల్‌లో ముందు నుంచే ఉందన్నారు మమత. ఆరోగ్య పథకం కింద రూ. 5 లక్షల వరకు అమలు చేస్తున్నామన్నారు.

మరో ఐదేళ్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అధికారం ప్రస్తుతమున్న మోదీ సర్కార్‌కు లేదన్నారు మమత. ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎక్స్‌పైర్ అయిపోతుందన్నారు. ఎక్స్‌పెయిరీ అయిపోయిన తర్వాత మెడిసన్ ఇస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ? అని ప్రశ్నించారామె. ఇది పూర్తిగా విలువలేని వ్యర్థ ప్రయోగమన్నారు మమత.

First published: February 1, 2019, 4:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading