Union Budget 2019 : రూ.27లక్షల కోట్ల బడ్జెట్.. ఎవరికి ఏమేం వచ్చాయి?

Live Union Budget 2019 Updates | 2019-20 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం రూ.27లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

news18-telugu
Updated: February 1, 2019, 7:55 PM IST
Union Budget 2019 : రూ.27లక్షల కోట్ల బడ్జెట్.. ఎవరికి ఏమేం వచ్చాయి?
పీయూష్ గోయల్
  • Share this:
ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసింది. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. రైతులు, ఉద్యోగులపై వరాలు కురిపించింది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు పెట్టుబడి సాయం. ఒక్కో రైతుకు రూ.6000 చొప్పున ఇస్తారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులు అర్హులు. 2018 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని కోసం రూ.75,000 కోట్లు కేటాయించారు.

ఆదాయపన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట. రూ.5లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ వస్తుంది. రూ.2.5లక్షల పైబడిన ఆదాయం ఉన్నవారు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అయితే, దానిపై ట్యాక్స్ రిబేట్ ఇస్తారు. దీని వల్ల 3కోట్ల మందికి లబ్ధి జరగనుంది.

ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత రంగ కార్మికుల కోసం పింఛన్ పథకం. నెలకు రూ.100 చెల్లిస్తే, 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ వస్తుంది. 10 కోట్ల మందికి లబ్ధి జరుగుతుంది.



చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2శాతం పన్ను మినహాయింపు

గ్రాట్యుటీ పరిమితి రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంపు

ఇంటి అద్దె మీద వచ్చే ఆదాయంపై రూ.2.5లక్షల వరకు పన్ను మినహాయింపుప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పేరుతో కోటి మంది యువతకు శిక్షణ. దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో మేధ సెంటర్లు ఏర్పాటు

రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్ల నిధులు కేటాయింపు. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్న కేంద్రం.
First published: February 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు