కేంద్రం బడ్జెట్ ప్రకటించిన కాసేపటికే...ప్రతిపక్షాలు... విమర్శల దాడికి దిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కేంద్ర బడ్జెట్‌పై కామెంట్స్ చేశారు. తాజాగా మోదీ సర్కార్ ప్రకటించిన బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాదన్నారు.ఇది ఎకౌంట్ ఫర్ ఓట్స్ బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 2018-19లో ద్రవ్యలోటును నియంత్రించలేకపోయిందన్నారు. దేశంలో ఉన్న వనరులకు పేదవారే మొదటి అర్హులు అన్న కేంద్రమంత్రి పియూష్ గోయల్ ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
బడ్జెట్ ప్రకటనకు ముందు కూడా చిదంబరం ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు దేశంలో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంటే, వృద్ధి రేటు 7 శాతానికి పైగా ఎలా నమోదయిందని ప్రశ్నించారు. జీడీపీ అంచనాలను పెంచుతున్న మోదీ సర్కారు, నిరుద్యోగుల సంఖ్యను దాచి పెడుతోందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు జరిగిన 2016లో అత్యధిక వృద్ధి రేటు(8.2 శాతం) నమోదయింది. ఈ సారి రూ.100 రూపాయల నోట్లను కూడా రద్దు చేయండంటూ మోదీ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.వందనోట్లు కూడా రద్దు చేస్తే మరోసారి అద్భుతమైన వృద్ధి రేటు నమోదవుతుంది’ అంటూ ఎద్దేవా చేశారు చిదంబరం.
It was not a Vote on Account. It was an Account for Votes.
— P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019
The demonetisation year was the best year of growth (8.2%) under Mr Modi. So, let's have another round of demonetisation.
This time let's demonetise 100 rupee notes.
— P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.