Home /News /politics /

UNEMPLOYED PEOPLE IN AP ANOINTED TELANGANA CM KCR WITH MILK AND ASKED AP CM YS JAGAN TO MAKE A JOB ANNOUNCEMENT PRV

CM KCR: ఏపీలో కేసీఆర్​కు పాలాభిషేకం.. ఏపీ సీఎం వైఎస్​ జగన్​కు తలనొప్పిగా వ్యవహారం!

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రసంగం ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అయితే పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రకటన పట్ల అనూహ్య స్పందన వచ్చింది.

ఇంకా చదవండి ...
    అందరూ ఊహించినట్లుగానే.. తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ (CM KCR) శుభవార్త చెప్పారు. ఉద్యోగాల (jobs in Telangana) పై అసెంబ్లీలో బుధవారం కీలక ప్రకటన చేస్తానని నిన్న వనపర్తి సభలో చెప్పడంతో.. ఇవాళ్టి ఉదయం నుంచే ఎంతో మంది యువత టీవీలకు అతుక్కుపోయారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రసంగం ప్రారంభించిన సీఎం కేసీఆర్... ఉద్యోగాల (jobs in Telangana) పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు (Notifications) విడుదల చేస్తామని సంచలన ప్రకటన చేశారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. పోలీస్ శాఖ మినహా ఉద్యోగార్థుల వయోపరిమితిని మరో పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు సీఎం కేసీఆర్. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. అయితే పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)​ ప్రకటన పట్ల అనూహ్య స్పందన వచ్చింది. ఏపీలో కొందరైతే ఏకంగా కేసీఆర్​కు పాలాభిషేకం (Anointed with milk) చేసేశారు.

    ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా..

    కేసీఆర్  (CM KCR) ప్రకటన పట్ల ఏపీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు (Representatives of the AP Unemployment Solidarity Committee) హర్షం వ్యక్తం చేశారు.  కేసీఆర్ చిత్రపటానికి ఏపీలోని విశాఖలో ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు పాలాభిషేకం (Anointed with milk) చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సీఎం కేసీఆర్  (CM KCR) కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే తరహాలో ఏపీ (AP) ప్రభుత్వం కూడా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ సీఎం తాజా ప్రకటనతో జగన్ (YS Jagan) సర్కార్ పై ఒత్తిడి పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎటువంటి ప్రకటన రాకపోవడంతో, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జగన్ సర్కార్ పై ఒత్తిడి తీసుకురావడానికి నిరుద్యోగులు ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు.

    తెలంగాణలోనూ సంబురాలు..

    తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని 91 వేల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి కెసిఆర్  (CM KCR) ఈ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో  తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు, నిరుద్యోగులు జరుపుకున్న సంబురాలు (Celebrations) మిన్నంటాయి. ఉద్యోగాల (jobs in Telangana) భర్తీకి ముఖ్యమంత్రి (CM KCR) నోట ప్రకటన వెలువడడంతో హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. టపాకాయాలు పేల్చి, మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఆయా జిల్లాల్లో పోటాపోటీగా ముఖ్యమంత్రి (CM KCR) చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Andhra Pradesh, CM KCR, Jobs in telangana, Vizag, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు