Home /News /politics /

UNDER WHAT LAW CBI ISSUED NOTICES TO CHIDAMBARAM QUESTIONED BY HIS LAWYER MS

ఏ చట్టం ప్రకారం ఆ ఆదేశాలిచ్చారు..? సీబీఐకి చిదంబరం న్యాయవాది సూటి ప్రశ్న

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం (File Photo)

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం (File Photo)

Chidambaram INX Meida case : మంగళవారం ఢిల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లిన సీబీఐ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు.. ఇంట్లో ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన మరో టీమ్.. ఆయన నివాసానికి నోటీసులు అతికించింది.

ఇంకా చదవండి ...
    ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం పట్ల సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ఆయన తరుపు న్యాయవాది తప్పు పట్టారు.రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలని మంగళవారం చిదంబరం ఇంటికి నోటీసులు అతికించడాన్ని ఆయన ఖండించారు. ఏ చట్టం ప్రకారం తన క్లయింట్‌ను రెండు గంటల్లోగా సీబీఐ ఎదుట హాజరుకావాలన్నారని ప్రశ్నించారు.

    సీబీఐ నోటీసులైతే ఇచ్చింది కానీ.. ఏ చట్టం ప్రకారం నా క్లయింట్ చిదంబరంను రెండు గంటల్లోగా హాజరవాలని ఆదేశించింది.ఆ చట్టాన్ని అందులో వారు పొందుపరచలేదు. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించినందునా.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాం. బుధవారం ఉదయం 10.30గంటలకు దీనిపై వాదనలు జరగనున్నాయి. కాబట్టి అప్పటివరకు చిదంబరంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీబీఐ వేచి చూడాలి.
    చిదంబరం తరుపు న్యాయవాది


    మంగళవారం ఢిల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లిన సీబీఐ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు.. ఇంట్లో ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన మరో టీమ్.. ఆయన నివాసానికి నోటీసులు అతికించింది. రెండు గంటల్లోగా సీబీఐ ఎదుట హాజరుకావాలని అందులో ఆదేశించింది.అదే సమయంలో ఢిల్లీ హైకోర్టులో చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దయింది. దీంతో చిదంబరం అరెస్ట్ తప్పదా? అన్న చర్చ జరుగుతోంది.సుప్రీంకోర్టు కూడా ప్రతికూలంగా స్పందిస్తే.. చిదంబరం జైలుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

    ఇదిలా ఉంటే, ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.ఐఎన్ఎక్స్‌కు లబ్ది చేకూర్చడం కోసం 'ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు'అవకతకలకు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా చిదంబరం ఉన్నారు.దీంతో ఇందులో ఆయన పాత్ర కూడా ఉందన్న అనుమానాలు తలెత్తాయి. మే 15, 2017లో దీనిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఇక ఈ వ్యవహారంపై దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న కారణంతో చిదంబరం కొడుకుపై కూడా కేసులు నమోదయ్యాయి. ఐఎన్ఎక్స్‌కు లబ్ది చేకూర్చేందుకు చిదంబరం కొడుకు డబ్బులు డిమాండ్ చేశారని ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణీ ముఖర్జీ గతంలో సీబీఐ విచారణలో వెల్లడించారు.



    ఇది కూడా చదవండి : చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు...అరెస్ట్‌కు రంగం సిద్ధం ?
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Chidambaram, Delhi, INX media case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు