వైసీపీలోకి ఉండవల్లి .... మంత్రివర్గంలో చోటు కల్పిస్తానన్న జగన్ ?

ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్

జగన్ ఉండవల్లిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారా? అంటే మాత్రం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో? అన్న విషయం ఎవరికి అంతుపట్టడం లేదు. ఏపీలో జగన్ గెలుపు ఖాయమని ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు అనేక సర్వేలు కూడా తేల్చేశాయి. దీంతో ఇప్పటికే పలువురు అధికార పార్టీకి చెందిన నాయకులు సైతం జగన్ పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ‌కూడా వైసీపీలోకి చేరిపోతున్నారా ? అన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. జగన్ ఉండవల్లిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారా? అంటే మాత్రం ఈ ప్రశ్నలకు
  అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఉండవల్లి అరుణ కుమార్ రాజకీయాల్లో తలపండిన నేత. అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు. అంతేకాకుండా జగన్ తండ్రి వైఎస్ఆర్‌కు ఎంతో ఆప్తుడు. ఎలాంటి విషయమైనా ముక్కు సూటిగా మొహమోటం లేకుండా చెప్పేస్తారు ఉండవల్లి. అనేక రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తుంటారు.ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో ఆయనను మించిన వారు ఉండరు.

  అయితే ఏపీ విభజన తర్వాత మాత్రం ఉండవల్లి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.ఆ మధ్య జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విభజన హామీలపై చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉండవల్లి కూడా ఉన్నారు. అప్పట్లో ప్రెస్ మీట్‌లు హడావుడి చేసిన ఆయన మళ్లీ గప్ చుప్ అయిపోయారు. మళ్లీ ఈ మధ్య జగన్ గెలుస్తారంటూ కూడా ఉండవల్లి జోస్యం చెప్పారు. అటు చంద్రబాబుపై కూడా గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన పార్టీలో ఉండవల్లి లాంటి సీనియర్ నేతలు ఉంటే పార్టీకి కూడా ఎంతో మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే తన మంత్రివర్గంలో చేరాలని జగన్ ఉండవల్లిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జగన్ ఆహ్వానానికి అటు ఉండవల్లి కూడా సూత్రప్రాయంగా ఓకే అన్నట్లు సమాచారం.

  మరోవైపు ప్రతిపక్ష హోదాలో ఉన్న కూడా చంద్రబాబును ధీటుగా ఎదుర్కోవాలంటూ ఉండవల్లి లాంటి సీనియర్ నేతలు తన పార్టీకి ఎంతో అవసరమని భావిస్తున్నారు జగన్. అందుకే ఆయన ఉండవల్లికి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తంమీద ఎన్నికల ఫలితాల మాటేమో కానీ.. పార్టీలు మాత్రం ఎవరికి వారు అధికారంలో వస్తే ఏం చేయాలన్న దానిపై జోరుగా ప్రణాళికలు,చర్చలు మాత్రం జరిపేస్తున్నారు.
  First published: