కోడెల ఆత్మహత్యపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

ఉండవల్లి అరుణ్ కుమార్

వైసీపీ రాజకీయంగా వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, టీడీపీ ఆరోపణలను, ప్రచారాన్ని ఉండవల్లి తప్పుపట్టారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, కోడెల ఆత్మహత్యపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీ రామారావు హయాం నుంచి రాజకీయాల్లో ఉన్న శివప్రసాదరావు లాంటి గ్రేట్ లీడర్ ఈ రకంగా చనిపోవడం (ఆత్మహత్య) బాధాకరం. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో అర్థం కావడం లేదు’ అని ఉండవల్లి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ‘కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఎవరికీ తెలీదు. కానీ, కోడెల గత చరిత్రను చూస్తే.. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. కానీ, అత్యంత సన్నిహితులు అయిన వారే ఆయన్ను ఘోరంగా అవమానించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు’ అని అభిప్రాయపడ్డారు. వైసీపీ రాజకీయంగా వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, టీడీపీ ఆరోపణలను, ప్రచారాన్ని ఉండవల్లి తప్పుపట్టారు.

    అయ్యయ్యో.. టపాసులు కాలుస్తుంటే.. కారు ఢీకొట్టేసింది...

    First published: