జగన్‌ ముందు ఉండవల్లి సరికొత్త డిమాండ్

ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్

సీఎం జగన్ ముందు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సరికొత్త ప్రతిపాదన పెట్టారు.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి సరికొత్త డిమాండ్ వినిపించారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... విశాఖతో పాటు అమరావతిలోనూ హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో పాటు రాజమండ్రిలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక తీర్చాలని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

    14 ఏళ్ల క్రితమే వైఎస్ఆర్ ఈ రకమైన ఆలోచన చేశారని ఉండవల్లి సీఎం జగన్‌కు వివరించారు. దీంతో పాటు మరో అంశాన్ని కూడా ఉండవల్లి తన లేఖలో ప్రస్తావించారు. రాజమండ్రిలో ఇసుక లభించడం లేదని... కొవ్వూరు నుంచి ఇసుక తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఉండవల్లి సూచించారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: