మనం కాశ్మీర్‌లో ఉన్నామా ? ఎంపీ కేశినేని నాని ట్వీట్

మనం ఆంధ్రాలో ఉన్నామా లేదంటే కాశ్మీరులోనే అనేది అర్థం కావడం లేదు’అంటూ మండిపడ్డారు.

news18-telugu
Updated: September 11, 2019, 11:05 AM IST
మనం కాశ్మీర్‌లో ఉన్నామా ? ఎంపీ కేశినేని నాని ట్వీట్
vijayawada mp kesineni nani arrest
news18-telugu
Updated: September 11, 2019, 11:05 AM IST
గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విజయవాడ ఎంపీ కేశినానిని ఛలో ఆత్మకూరులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్దుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీ నాని ప్రకాశం బ్యారేజ్‌పై బైఠాయించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై ట్వీట్ చేస్తూ.. ‘మనం ఆంధ్రాలో ఉన్నామా లేదంటే కాశ్మీరులోనే అనేది అర్థం కావడం లేదు’అంటూ మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తంచేశారు.

ప్రజా ప్రతినిధుల్ని అరెస్ట్ చేయడం సమస్యకు పరిష్కారం కాదంటూ మరో ట్వీట్ చేశారు కేశినేని నాని. ప్రతిపక్ష పార్టీపై పోలీసులు తప్పుడు కేసు పెట్టడంతోనే సమస్య మొదలైందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, చట్టాల్ని కాపాడాల్సిన బాద్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.

Loading...
First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...