జగన్ కేబినెట్‌లో కొత్తగా ఆ సీనియర్ నేతకు ఛాన్స్ ?

బీసీ నాయకుడి కారణంగా ఖాళీ అవుతున్న కేబినెట్ స్థానాన్ని కాపు వర్గానికి చెందిన ఉమ్మారెడ్డికి జగన్ కేటాయిస్తారా అనే చర్చ కూడా మొదలైంది.

news18-telugu
Updated: July 2, 2020, 7:43 AM IST
జగన్ కేబినెట్‌లో కొత్తగా ఆ సీనియర్ నేతకు ఛాన్స్ ?
వైఎస్ జగన్ (File)
  • Share this:
మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాష్ట్ర కేబినెట్‌లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆ రెండు స్థానాలపై అనేక మంది వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ ఛాన్స్‌ను తమ సొంతం చేసుకోవాలని... చాలామంది వైసీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినివిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో సీఎం జగన్ మనసులో ఏముందనే అంశం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. జగన్‌కు సన్నిహితంగా ఉండే నేతలు సైతం ఈ విషయంలో ఎలాంటి సమాచారం బయటకు చెప్పడం లేదని తెలుస్తోంది.

అయితే గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ స్థానంలో అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును సీఎం జగన్ కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో సీనియర్ అయిన ఉమ్మారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవడం వల్ల ఎవరూ పెద్దగా ఇబ్బందిపడబోరని భావిస్తున్న సీఎం జగన్... సీనియర్ అయిన ఉమ్మారెడ్డి సేవలు మంత్రివర్గంలో అవసరమవుతాయని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బీసీ నాయకుడి కారణంగా ఖాళీ అవుతున్న కేబినెట్ స్థానాన్ని కాపు వర్గానికి చెందిన ఉమ్మారెడ్డికి జగన్ కేటాయిస్తారా అనే చర్చ కూడా మొదలైంది.

Ummareddy venkateshwarlu into cabinet, ap cabinet news, ummareddy into jagan cabinet, ap cabinet reshuffle, కేబినెట్‌లోకి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఏపీ కేబినెట్ న్యూస్, ఏపీ న్యూస్
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(ఫైల్ ఫోటో)


ఇప్పటికే ఏపీలో కేబినెట్‌లో సీఎం జగన్ అనేకమంది కాపు నేతలకు ప్రాధాన్యత కల్పించారు. ఈ నేపథ్యంలో అదే వర్గానికి చెందిన నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని ఇతర వర్గాలు భావించే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఖాళీ కాబోతున్న రెండు మంత్రివర్గ స్థానాల్లో ఒకటి ఉమ్మారెడ్డికి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ మాత్రం వైసీపీలో బలంగా వినిపిస్తోంది.
First published: July 2, 2020, 7:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading