కేంద్రమంత్రి ఉమాభారతికి బీజేపీలో అత్యున్నత పదవి

ఉమాభారతి

ఉమా భారతి లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ ప్రకటించిన కొద్దిరోజులకే ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

 • Share this:
  భారత రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందారు కేంద్రమంత్రి ఉమా భారతి. పాలిటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి ఉమా భారతి...ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమెకు అత్యున్నత పదవి ఇవ్వాలని భారతీయ జనతా పర్టీ భావించింది. ఆమెను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ... పార్టీ ప్రకటన విడుదల చేసింది. అయితే ఉమా భారతి లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ ప్రకటించిన కొద్దిరోజులకే ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

  యుక్తవయస్సులోనే విజయరాజె సింధియా స్పూర్తితో ఉమాభారతి భారతీయ జనతా పార్టీలో చేరి 1984లో లోకసభకు పోటీచేశారు. 1984లో ఓడిపోయినా కూడా 1989లో ఖజురాహో స్థానం నుండి పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1991, 1996 మరియు 1998లలో అదే స్థానం నుండి వరస విజయాలను నమోదుచేసింది. 1999లో స్థానం మార్చి భోపాల్ నియోజకవర్గం నుండి గెలుపొంది కేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిపదవిని కూడా నిర్వహించారు. 2003 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆమె నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాలుగింట మూడువంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించారు. 2004 ఆగష్టులో "1994 హుబ్లీ వివాదం" కేసులో అరెస్టు వారెంటు జారీకావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె భారతీయ జనతా పార్టీని వీడి భారతీయ జన శక్తి అను కొత్త పార్టీని స్థాపించారు. తదనంతర పరిస్థితులలో 2011లో ఆమె తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

  ప్రస్తుతం యూపీలోని ఝాన్సీ లోక్‌ సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు ఉమా భారతి. మే తరువాత ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లనున్నానని ఇప్పటికే ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వయసు రీత్యా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడం లేదని, తన స్థానంలో యువతకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. దీంతో ఆమె సేవలు పార్టీకి కావాలంటూ, కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న ఉమాకు ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించింది బీజేపీ.

  ఇవికూడా చదవండి:

  దక్షిణ బెంగళూరుకు అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్... ప్రధాని మోదీ దక్షిణ బెంగళూరుకు పోటీ చేస్తారా?

  చంద్రబాబుపై జూనియన్ ఎన్టీఆర్ మామ సంచలన వ్యాఖ్యలు

  రాహుల్ గాంధీకి మూడు ప్రశ్నలు సంధించిన అమిత్ షా
  First published: