మహారాష్ట్ర సీఎంగా నేడు ఉద్ధవ్ ప్రమాణస్వీకారం.. అతిథులు వీళ్లే..

మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

news18-telugu
Updated: November 28, 2019, 6:56 AM IST
మహారాష్ట్ర సీఎంగా నేడు ఉద్ధవ్ ప్రమాణస్వీకారం.. అతిథులు వీళ్లే..
ఉద్ధవ్ థాక్రే (ఫైల్ ఫొటో)
  • Share this:
కొన్ని రోజులు డ్రామాను తలపించిన మహారాష్ట్ర రాజకీయం ఓ కొలిక్కి వచ్చింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయ్యాయి. దానికి సంబంధించి ఈ రోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీల మద్దతు లేఖలు తీసుకుని ఉద్ధవ్ థాక్రే, మరికొందరు సీనియర్ నేతలు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలిసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమ వద్ద ఉందని వెల్లడించారు కూడా. ముంబైలోని ఓ హోటల్లో జరిగిన ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేన పార్టీ నేతల సమావేశంలో ‘మహా వికాస్ అఘాడి’ కూటమి నేతగా ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. థాక్రే పేరును ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలా సాహెబ్ థారోట్ ప్రతిపాదించారు.

ఇదిలా ఉండగా, ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారోత్సవానికి పలు రాష్ట్రాల సీఎంలను, రాజకీయ ప్రముఖులను, 40 వేల మంది అతిథులను, 700 మంది రైతులను ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించిన ఉద్ధవ్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అటు.. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, మహారాష్ట్ర సీఎం కమల్‌నాథ్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భఘేల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, డీఎంకే చీఫ్ స్టాలిన్, రతన్ టాటా, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ తదితరులను కూడా ఆహ్వానించారు.

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>