నిజామాబాద్ ఆసుపత్రిలో అన్నదానం... రెండేళ్లు పూర్తి... కవిత ఔదార్యం

నిజామాబాద్ పట్టణంలోని పెద్దాసుపత్రికి వచ్చే పేదల ఆకలి తీర్చేందుకు ఆసుపత్రి ప్రాంగణంలోనే నవంబర్ 8, 2017న అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

news18-telugu
Updated: November 8, 2019, 4:25 PM IST
నిజామాబాద్ ఆసుపత్రిలో అన్నదానం... రెండేళ్లు పూర్తి... కవిత ఔదార్యం
అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కవిత
  • Share this:
రెండేళ్ల నుంచి నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ కవిత చేస్తున్న అన్నదానం రెండేళ్ల నుంచి నిర్వీరామంగా కొనసాగుతోంది. నిజామాబాద్ పట్టణంలోని పెద్దాసుపత్రికి వచ్చే పేదల ఆకలి తీర్చేందుకు ఆసుపత్రి ప్రాంగణంలోనే నవంబర్ 8, 2017న అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోజూ ఈ ఆసుపత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా రోగులు వస్తుంటారు. ఓసారి ఎంపీ హోదాలో ఈ ఆసుపత్రికి వచ్చిన కవిత... రోగులకు ఆహారం లభించడం లేదనే విషయాన్ని గుర్తించారు. దీనిపై వెంటనే స్పందించి నిజామాబాద్ పెద్దాసుపత్రిలో అన్నదానాన్ని మొదలుపెట్టారు. ఈ అన్నదాన కేంద్రంలో రోజూ సుమారు 800 నుంచి 900 మంది భోజనం చేస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని అన్నదానాన్ని ఒక్క నిజామాబాద్ కే పరిమితం చేయవద్దని భావించి... జిల్లాలోని మరో పెద్దాసుపత్రి అయిన బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా 2018 ఏప్రిల్ 26న మరో అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. అక్కడ ప్రతీ రోజు సుమారు 350 మంది ఆకలి తీరుతోంది. ఆ తరువాత ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో 2018 జులై 5 నుంచి అన్నదానం చేస్తున్నారు. అక్కడ రోజు 300 మంది ఆకలి తీర్చుకుంటున్నారు. అన్నదానం కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వాసుపత్రులకే పరిమితం చేయకుండా... పేద విద్యార్థులు శ్రద్దగా చదువుకోవాలన్న ఆలోచనతో నిజామాబాద్ జిల్లా గ్రంథాలయం దగ్గర కూడా అన్నదానం చేస్తున్నారు. 2018 జులై 15 న మొదలైన ఈ అన్నదాన కేంద్రంలో రోజుకు సుమారు 250 మంది విద్యార్థులు కడుపు నిండుతోంది.


First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>