నారి భేరి: తెలంగాణ ఎన్నికల బరిలో ఇద్దరు హీరోయిన్లు

నారి భేరి: తెలంగాణ ఎన్నికల బరిలో ఇద్దరు హీరోయిన్లు

ఎన్నికల బరిలోకి దిగుతున్న హీరోయిన్లు విజయశాంతి, రేష్మ

సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతితో పాటు ... కొత్త హీరోయిన్ రేష్మి సైతం తొలి సారి ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేస్తు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనుంది.

 • Share this:
  తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. ఇటు అధికార పార్టీ.. అటు ప్రతిపక్షాలు హోరాహోరిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
  ఇప్పటికే మహా కూటమి తరపున కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ
  ఎన్నికల బరిలోకి ఇద్దరు హీరోయిన్లు దిగుతున్నారు.

  సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతితో పాటు ... కొత్త హీరోయిన్ రేష్మి సైతం తొలి సారి ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేస్తు తమ అదృష్టాన్ని
  పరిక్షించుకోనుంది. విజయశాంతి ఇప్పటికే పలు పార్టీలు మారి చివరకు కాంగ్రెస్‌లో సెటిల్‌ అయ్యారు. 2009 టీఆర్‌ఎస్‌ తరపున మెదక్‌
  నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మెదక్‌లో అసెంబ్లీకి పోటీ చేసి ప్రస్తుత డిఫ్యూటీ స్పీకర్‌ పద్మా
  దేవేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

  దీంతో తాజాగా జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేస్తుందా లేదా అన్న సందేహాలు తెరపైకొచ్చాయి. దీంతో
  విజయశాంతి ఈ సారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గతంలో మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రాములమ్మ
  ఇప్పుడదే పార్లమెంట్ సెగ్మెంట్ అయిన దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
  మరోవైపు వర్థమాన హీరోయిన్‌ రేష్మి పొలిటికల్ ఎంట్రీకి సిద్దమయ్యారు. మారుతీ డైరెక్షన్‌లో వచ్చిన ఈరోజుల్లో మూవీతో ప్రేక్షకులకు
  పరిచయం అయిన రేష్మి టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో... రాజకీయల వైపు ఆమె అడుగులు వేసింది. కొద్దిరోజుల క్రితం
  ఆమె బీజేపీలో చేరింది. తాజాగా బీజేపీ టిక్కెట్‌ పొందిన ఆమె ఖమ్మం జిల్లా వైరా ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దిగింది.

  రేష్మ తల్లి హైకోర్టులో లాయర్‌.. చేస్తుండగా... తండ్రి సింగరేణి కాలరీస్‌ ఎగ్జిగ్యూటివ్‌ డైరెక్టర్‌. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇప్పుడు
  ఆమె బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చింది. కొంత కాలంగా బీజేపీలో క్రియాశాలకంగా ఉంటున్న ఆమె మహబూబబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీ
  చేయాలని భావించింది. అయితే బీజేపీ అధిష్టానం ఆమెకు ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ సీటు కేటాయించింది. టిక్కెట్‌ రావడంతో రేష్మ
  ఇప్పటికే వైరాలో ప్రచారం ప్రారంభించింది. మరి ఈ ఇద్దరు హీరోయిన్ల రాజకీయాల్లో ఎంత వరకు సక్సెస్ అవుతారో... ప్రజలు వీరిని ఎంతవరకు ఆమోదిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
  Published by:Sulthana Begum Shaik
  First published:

  అగ్ర కథనాలు