టీడీపీకి ఊహించని షాక్.. వైసీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్..

ఏపీలో టీడీపీకి భారీ షాక్ తగులుతోంది. ఇప్పటికే అధికారం కోల్పోయి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడగా.. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

news18-telugu
Updated: May 26, 2020, 1:34 PM IST
టీడీపీకి ఊహించని షాక్.. వైసీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో టీడీపీకి భారీ షాక్ తగులుతోంది. ఇప్పటికే అధికారం కోల్పోయి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడగా.. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పర్చూరు నియోజక వర్గ ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ టీడీపీని వదిలి అధికార వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వారిద్దరు మంత్రి బాలినేనితో ఒంగోలులోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కాసేపట్లో తాడేపల్లి బయలుదేరి, సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. వీరిద్దరే కాకుండా పలువురు టీడీపీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే వారంతా అధికార పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అటు.. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి వైసీపీకి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.
First published: May 26, 2020, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading