Home /News /politics /

TWO SAME TYPE OF INCIDENTS HAPPENED IN CHANDRABABU NAIDU AND YS JAGAN REGIME BA

చంద్రబాబు టైమ్‌లో జరిగినట్టే జగన్‌కూ జరుగుతోంది....

చంద్రబాబు, జగన్

చంద్రబాబు, జగన్

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన రెండు ఘటనల తరహాలోనే జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి.

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే.. రెండు ఘటనలు రిపీట్‌గా చోటుచేసుకున్నాయి.  చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన రెండు ఘటనల తరహాలోనే జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. ఆ రెండింట్లో ఒకటి. గోదావరిలో బోటు ప్రమాదం. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో కూడా గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు మునిగింది. పదుల సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ.. టీడీపీ సర్కారు మీద తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా జగన్ పాలనలో కూడా అలాంటి ప్రమాదమే జరిగింది. కచ్చులూరు వద్దు పాపికొండలకు వెళ్తున్న బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కూడా పదుల సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొన్ని మృతదేహాలు దొరకలేనేలేదు. ఘటన జరిగి 20 రోజుల తర్వాత కూడా ఇంకా బోటును కూడా బయటకు తీయలేకపోయారు.

    ఇక రెండో ఘటనను పరిశీలిస్తే.. అధికారుల మీద దాడి. చంద్రబాబునాయుడి పాలనలో దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి చేయడం పెను దుమారాన్ని సృష్టించింది. చింతమనేనిని ప్రభుత్వం వెనకేసుకొచ్చి తీవ్ర విమర్శల పాలైంది. జగన్ పాలనలో కూడా అలాంటి ఘటనే జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీఓ సరళ మీద దౌర్జన్యం చేశారు. ఈ కేసులో కోటంరెడ్డిని, ఆయన అనుచరుడిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. గతంలో కూడా కోటంరెడ్డి ఓ జర్నలిస్టును బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

    జహీరాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Godavari boat tragedy, Kotamreddy sridhar reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు