మంత్రి ఇలాకాలో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నం..

సాక్షాత్తూ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సొంత ఇలాకాలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

news18-telugu
Updated: October 12, 2019, 9:39 PM IST
మంత్రి ఇలాకాలో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నం..
పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: October 12, 2019, 9:39 PM IST
సాక్షాత్తూ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సొంత ఇలాకాలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరిని స్థానికులు రక్షించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావును అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్లారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోనూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. అప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమానికి బాసటగా నిలిచారు. సకలజనుల సమ్మె సమయంలో 17 రోజుల పాటు బస్సులు బంద్ చేసి ఉద్యమ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. అయితే, అలాంటి ఖమ్మం జిల్లాలో, సాక్షాత్తూ రవాణా శాఖ మంత్రి సొంత జిల్లాలో ఇద్దరు కార్మికులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనతో ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆవేదన చెందాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 90శాతం కాలిన గాయాలు కావడంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రకటనతో మనోవేదనకు గురై ఆత్మహత్యయత్నం చేశాడు.

శ్రీనివాసరెడ్డికి మద్దతుగా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఖమ్మం కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసి.. చావుబతుకుల్లో ఉన్నా కూడా ప్రభుత్వం కనీసం స్పందించలేదనే ఆవేదనతో మరో కార్మికుడు వెంకటేశ్వరాచారి కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అయితే, పక్కనే ఉన్నవారు అడ్డుకుని అతడిపై నీళ్లు పోసి రక్షించారు.

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. సమస్యలపై పోరాటం సాగించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ఉంటుందన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కేసీఆర్‌దే బాధ్యత అని అన్నారు. కార్మికుల ఆకలి బాధలు కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం కోసం కాదన్నారు. కేసీఆర్ అసమర్థ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు.First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...