Home /News /politics /

TWO PARTIES FOLLOWERS WHO ARE IN SARPANCH RACE ARE HAVING SAME NAME IN KRISHNA DISTRICT AP PANCHAYAT ELECTIONS HSN

AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఇది మరీ విచిత్రం.. ఆ గ్రామంలో సర్పంచ్ బరిలో ఉన్న ఇద్దరికీ ’పేర్ల‘ తలనొప్పి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కృష్ణా జిల్లాలోనూ ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో పోటీ పడుతున్న ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు ఓ కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఎవరి ఓటు ఎవరికి పడుతుందోనని గుబులు పట్టుకుంది. ఇంతకీ అసలు కథేంటంటే..

    ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సిత్ర విసిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసిపోతోంటే, మరికొన్ని చోట్ల ఆయా పార్టీలు బలపరిచిన మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొన్ని చోట్ల సొంత కుటుంబ సభ్యులే బరిలో దిగి పంచాయతీ పోరులో సెగలు పుట్టిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోనూ ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో పోటీ పడుతున్న ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు ఓ కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఎవరి ఓటు ఎవరికి పడుతుందోనని గుబులు పట్టుకుంది. వాస్తవానికి ఊళ్లల్లో మైకుల ద్వారా పంచాయతీ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఫలానా పేరు ఉన్న వ్యక్తి నాయకత్వాన్ని బలపరచండి, సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించండి అని మైకుల ద్వారా ప్రచారం చేస్తుంటారు. కానీ ఆ ఊళ్లో మాత్రం ఆ తరహా ప్రచారం చేస్తే ఎవరి ఓటు ఎవరికి పడుతుందా అని భయపడిపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

    కృష్ణా జిల్లాలో తిరువూరు మండలంలోని మల్లేల పంచాయతీ ఉంది. ఈ గ్రామంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అయితే ఈ గ్రామంలో వైసీపీ బలపరిచిన వంగూరి మరియమ్మ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. ఇందులో విచిత్రం ఏముందంటారా..? టీడీపీ బలపరిచిన అభ్యర్థి పేరు కూడా వంగూరి మరియమ్మే. అటు వైసీపీ, ఇటు టీడీపీ బలపరిచిన ఇద్దరు అభ్యర్థుల పేర్లూ, ఇంటిపేరుతో సహా ఒకటే కావడంతో ఆ గ్రామంలో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఎవరు గెలిచినా వంగూరి మరియమ్మ అనే పేరు గల వ్యక్తే ఈసారి సర్పంచ్ అవుతారని ఈజీగానే తేల్చేస్తున్నారు. అయితే ఈ పేర్లతో ప్రజలు తికమకపడి ఎవరి మద్దతుదారులు ఎవరికి ఓటేస్తారోనని సర్పంచ్ అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. అందుకే తమకు కేటాయించబోయే గుర్తులను ప్రచారంలో బాగా వాడుకుని, ప్రజల మైండ్లలో రిజిస్టర్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ గ్రామంలో ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాలి.

    ఇదిలా ఉండగా, ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. పేరుకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలే అయినా రాజకీయ పార్టీలు మాత్రం ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుంటుంటాయి. ఇప్పటికే వచ్చిన మొదటి, రెండో విడతల ఫలితాల్లో అధికారంలో ఉన్న వైసీపీయే పైచేయి సాధించింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా పంచాయతీ ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. తమ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Gram Panchayat Elections, Local body elections, Nimmagadda Ramesh Kumar

    తదుపరి వార్తలు