వైసీపీ నేతను చెప్పుతో కొట్టిన యువతి.. రెండు వర్గాల ఫైట్

వైసీపీ నాయకుడు రెంటపల్లి సుబ్బారెడ్డి ని నందిని అనే అమ్మాయి చెప్పుతో కొట్టింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరుగుతున్న సమయంలో స్టేషన్ బయట మోహరించిన ఇరు వర్గాల ఘర్షణకు దిగాయి.

news18-telugu
Updated: July 20, 2019, 10:35 PM IST
వైసీపీ నేతను చెప్పుతో కొట్టిన యువతి.. రెండు వర్గాల ఫైట్
కొట్టుకుంటున్న వైసీపీలోని రెండు వర్గాలు
  • Share this:
ప్రకాశం జిల్లాలో వైసీపీలోని రెండు వర్గాలు కొట్టుకున్నాయి. యర్రగొండపాలెంలో పోలీస్ స్టేషన్ వద్ద ఘర్షణ కు దిగాయి. వైసీపీ లోని 2 వర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీస్ స్టేషన్ ముందే ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వైసీపీ నాయకుడు రెంటపల్లి సుబ్బారెడ్డి ని నందిని అనే అమ్మాయి చెప్పుతో కొట్టింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరుగుతున్న సమయంలో స్టేషన్ బయట మోహరించిన ఇరు వర్గాల ఘర్షణకు దిగాయి.

వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చెప్పుతో దాడిచేసిన నందిని టీడీపీ కార్యకర్త. ఆమె ఆరోగ్యమిత్ర గా పుల్లలచెరువు లో పనిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం రాగానే తన ఉద్యోగం కాపాడుకోవడం కోసం.. పుల్లలచెరువు మండలానికి చెందిన YCP నాయకుడు రోశిరెడ్డి సహాయంతో.. మంత్రి అదిమూల సురేష్ ద్వారా లెటర్ తీసుకుని.. తిరిగి ఉద్యోగంలో కొనసాగేందుకు సచివాలయానికి వెళ్ళింది. ఇది తెలుసుకున్న మరో వైసీపీ నేత సుబ్బారెడ్డి.. నందిని అమరావతి సచివాలయంలో ఉన్న ఫోటోలను సేకరించి స్థానిక వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేసాడు. దీంతో నందిని... వైసీపీ నేత సుబ్బారెడ్డిపై చెప్పుతో కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్ కి ఇరువర్గాలు వెళ్లిన సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>