news18-telugu
Updated: January 17, 2020, 10:52 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో హోం మంత్రి మేకతోటి సుచరిత ఇలాకాలో వైసీపీ నేతలు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య వివాదం ముదిరి తోపులాట దాకా వెళ్లింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బహుమతులు ఇచ్చే విషయంలో వివాదం తలెత్తింది. ఆ వివాదం పెద్దదై వైసీపీ మండల కన్వీనర్ వర్గానికి, మరో వర్గానికి మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసుల.. ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు. అయితే.. పెదనందిపాడులోని పార్టీ ఆఫీస్కు చేరుకున్న ఇరు వర్గాలు మళ్లీ ఘర్షణకు దిగాయి.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. ఈ ఘటనపై వైసీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ పరువును దిగజార్చేలా వ్యవహరించడంపై గుర్రుగా ఉంది. బాధ్యులపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
January 17, 2020, 10:52 AM IST