కోడిగుడ్ల కాంట్రాక్ట్ కోసం కొట్టుకున్న వైసీపీ నేతలు...

వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరస్పరం రాళ్ళూ రువ్వుకున్నారు.. కర్రలతో బీభత్సంగా కొట్టుకున్నారు.

news18-telugu
Updated: October 19, 2019, 7:52 PM IST
కోడిగుడ్ల కాంట్రాక్ట్ కోసం కొట్టుకున్న వైసీపీ నేతలు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 19, 2019, 7:52 PM IST
పాఠశాలలకు కోడిగుడ్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు వైసీపీ నేతలు కొట్టుకున్నారు. కర్నూలు కలెక్టరేట్‌లో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లాలో పాఠశాలలకు సప్లై చేసే కోడిగుడ్ల టెండర్లు నందికొట్కూరుకు చెందిన యువనేత, డోన్ నాయకుడు దక్కించుకునేందుకు ప్రయత్నించారు.. అయితే కాంట్రాక్ట్ తమకు కావాలంటే.. తమకు కావాలని రెండు గ్రూపులు వాదించుకున్నాయి. ఎవరూ తగ్గకపోవడం తోపాటు తిట్ల దండకం మొదలుపెట్టారు. దీంతో వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరస్పరం రాళ్ళూ రువ్వుకున్నారు.. కర్రలతో బీభత్సంగా కొట్టుకున్నారు. ఈ దాడిలో డోన్ వైసీపీ నాయకుడు సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. డీఈవో ఆఫీసు ఎదుటే తీవ్రంగా కొట్టుకోవడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు డీఈఓ ఆఫీసులోకి కూడా చొరబడడంతో… సిబ్బంది బెంబేలెత్తిపోయారు. ఇంతలో పోలీసుల రాకతో ఈ మూక అక్కడినుంచి పరారయ్యింది.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...