చిత్తూరు జిల్లాలో కొడవళ్లతో కొట్టుకున్న వైసీపీ నాయకులు

చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు పరస్పరం కొడవళ్లతో దాడులు చేసుకున్నారు.

news18-telugu
Updated: May 23, 2020, 7:41 PM IST
చిత్తూరు జిల్లాలో కొడవళ్లతో కొట్టుకున్న వైసీపీ నాయకులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు పరస్పరం కొడవళ్లతో దాడులు చేసుకున్నారు. పీలేరు మండలం యనమలవారిపల్లెలో ఈ ఘటన జరిగింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి ఈ రోజుకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు. యనమలవారి పల్లెలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య రాయితీ వేరుశనగ విత్తనాల విషయంలో గొడవ జరిగింది. ఉదయం ఓసారి గొడవ జరిగింది. ఇరు వర్గాలను చుట్టుపక్కల వారు సర్దిచెప్పారు. అయితే, మధ్యాహ్నం మరోసారి ఇరు వర్గాల వారు తిరిగి కొడవళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో శ్రీరాములు రాజు అనే రైతు మెడపై లోతు గాయం అయింది. జయచంద్రారెడ్డి అనే మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరువురిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading