TWO FORMER TTD CHAIRMEN TO BATTLE IT OUT IN TIRUPATI ASSEMBLY POLLS BA
తిరుపతిలో రసవత్తర పోరు.. ఇద్దరు మాజీ టీటీడీ చైర్మన్ల మధ్య ఫైట్..
ప్రతీకాత్మక చిత్రం
భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006లో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. చదలవాడ కృష్ణమూర్తి 2015లో దేవస్థానం బోర్డు చైర్మన్గా సేవలు అందించారు.
తిరుపతిలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా సాగనుంది. ఇద్దరు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు చైర్మన్లు తలపడనున్నారు. వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. ఈ సారి గెలవాలని ఆయన కసితో ఉన్నారు. మరోవైపు జనసేన నుంచి చదవలవాడ కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశారు. వీరితో పాటు టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006లో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. చదలవాడ కృష్ణమూర్తి 2015లో దేవస్థానం బోర్డు చైర్మన్గా సేవలు అందించారు. తిరుపతిలో బలమైన బలిజ సామాజికవర్గానికి చెందిన చదలవాడ కృష్ణమూర్తి గతంలో టీడీపీలో ఉన్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ మీద అవినీతి ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్లు పోటీ పడడం తిరుపతిలో ఆసక్తికరంగా మారింది.
భూమన కరుణాకర్ రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి
2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎం.వెంకటరమణ పోటీ చేశారు. వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి బరిలోదిగారు. భూమన మీద వెంకటరమణ విజయం సాధించారు. అయితే, ఆయన అనారోగ్యం కారణంగా చనిపోవడంతో వెంకటరమణ భార్య సుగుణమ్మను టీడీపీ తరఫున పోటీకి నిలిపారు. ఆ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి ఆర్. శ్రీదేవి పోటీ చేశారు. 2015లోజరిగిన ఆ ఉప ఎన్నికలో సుగుణమ్మ గెలుపొందారు. ఇప్పుడు మరోసారి టికెట్ సాధించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.