• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TWO EFFECTIVE WAYS TO STOP CAA AND NRC SUGGESTED BY PRASHANT KISHOR MS

రెండే మార్గాలు.. : ఎన్‌ఆర్‌సీ,సీఏఏని అడ్డుకోవడంపై ప్రశాంత్ కిశోర్

రెండే మార్గాలు.. : ఎన్‌ఆర్‌సీ,సీఏఏని అడ్డుకోవడంపై ప్రశాంత్ కిశోర్

ప్రశాంత్ కిశోర్ (File Photo)

ఎన్‌ఆర్‌సీ,సీఏఏలను అడ్డుకోవడానికి రెండే మార్గాలంటూ ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ నమోదు(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లను ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పౌరసత్వ నమోదు డీమోనిటైజేషన్ లాంటిదేనని, నువ్వు ఈ దేశ పౌరుడివే అని నిరూపించుకునేంత వరకు నీ పౌరసత్వం చెల్లుబాటు కాదని గతంలో ఆయన వ్యాఖ్యానించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏలను అడ్డుకోవడానికి రెండే మార్గాలంటూ ట్విట్టర్ వేదికగా తాజాగా
    ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    ఎన్‌ఆర్‌సీ,సీఏఏలకు వ్యతిరేకంగా అన్ని వేదికల పైన శాంతియుత నిరసన తెలిపాలని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. అలాగే ఈ రెండు చట్టాలను వ్యతిరేకిస్తూ 16మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులంతా ఒక్క తాటి పైకి రావాలని సూచించారు. ఈ రెండు మార్గాల ద్వారా ఆ చట్టాలు అమలు కాకుండా అడ్డుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిశోర్ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆయన సూచనకు మద్దతునిస్తుండగా.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ చట్టం చేశాక దాన్ని తిరస్కరించే అధికారం ముఖ్యమంత్రులకు ఉండదంటున్నారు.

    Published by:Srinivas Mittapalli
    First published:

    అగ్ర కథనాలు