ఒకే ఆర్టీసీ బస్సులో ఇద్దరు కండక్టర్లు... ప్రయాణికులు షాక్

దీంతో ఈ విషయమైన ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిపో మేనేజర్‌ను సంప్రదించినా అయినా కూడా స్పందించలేదు.

news18-telugu
Updated: November 13, 2019, 8:47 AM IST
ఒకే ఆర్టీసీ బస్సులో ఇద్దరు కండక్టర్లు... ప్రయాణికులు షాక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒక కండక్టర్ ఉండే బస్సుల్లో ఇద్దరు కండక్టర్లను చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఆ బస్సుకు కండక్టర్ నేనంటే నేనంటూ ఇద్దరు గొడవపడంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం వికారాబాద్‌లో చోటు చేసుుంది. సదాశివపేట వెళ్లేందుకు వికారాబాద్ డిపో నుంచి అద్దె బస్సు బయల్దేరింది. ఆ సమయంలో డ్రైవర్‌తో పాటు కండక్టర్ కూడా బస్సు ఎక్కాడు. అయితే బస్సు వికారాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే మరో యువకుడు బస్సెక్కి కండక్టర్ నేనన్నాడు. అయితే అప్పటికీ బస్సులో ఉన్న కండక్టర్ వారం నుంచి ఈ బస్సుకు నేనే కండక్టర్‌గా ఉన్నాను. నువ్వెలా వచ్చావ్ అంటూ ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఆ యువకుడు డిపో నుంచి పంపించితేనే వచ్చానని .. తన చేతిలో ఉన్న టిమ్ మిషన్ కూడా చూపించాడు. దీంతో ఈ విషయమైన ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిపో మేనేజర్‌ను సంప్రదించినా అయినా కూడా స్పందించలేదు. మొత్తం మీద ఆర్టీసీ సమ్మెతో బస్సుల్లో ప్రయణికులకు మాత్రం వింత వింత అనుభవాలు... ఎదురవుతున్నాయి.
First published: November 13, 2019, 8:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading