ట్విట్టర్ సంచలన నిర్ణయం... రాజకీయ ప్రకటనలపై నిషేధం

రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప కొనకూడదు" అని ట్విటర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: October 31, 2019, 10:07 AM IST
ట్విట్టర్ సంచలన నిర్ణయం... రాజకీయ ప్రకటనలపై నిషేధం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో అన్ని రాజకీయ ప్రకటనలపై నిషేధం విధిస్తూ... ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబరు 22 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు 15న వెల్లడిస్తామని ట్విటర్‌ సీఈవో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫేక్‌న్యూస్‌, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామర్నారు. అన్ని రాజకీయ ప్రకటనలను తన వేదిక నుండి నిషేధిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.

రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప కొనకూడదు" అని ట్విటర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే ట్వీట్ చేశారు. ఈ విధానం గురించి మరిన్ని వివరాలను నవంబర్ 15న వెల్లడిస్తామన్నారు. నవంబర్ 22 వ తేదీ నుంచి అన్ని రాజకీయ ప్రకటనలను అంగీకరించడం మానేస్తామని డోర్సే చెప్పారు. మరోవైపు ట్విటర్‌ తీసుకున్న ఈ నిర్ణయం డెమొక్రాట్ల ప్రశంసంలందుకోగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ అపహాస్యం చేయడం గమనార్హం.

Published by: Sulthana Begum Shaik
First published: October 31, 2019, 10:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading