ఢిల్లీ కాంగ్రెస్ నేతలు - కేటీఆర్ ట్వీట్ ఫైట్

కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కుంతియాలకు ట్విటర్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.


Updated: September 8, 2018, 10:10 PM IST
ఢిల్లీ కాంగ్రెస్ నేతలు - కేటీఆర్ ట్వీట్ ఫైట్
కేటీఆర్ (ఫైల్ ఫొటో)

Updated: September 8, 2018, 10:10 PM IST
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో కేటీఆర్ ట్వీట్ ఫైట్ చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌కు ట్విటర్ వేదికగా పంచ్ విసిరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ‘దేశంలో పెద్ద బఫూన్ ’ అంటూ ఇటీవల కేసీఆర్ విమర్శించారు. అయితే, రాహుల్ గాంధీ మీద టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలను దిగ్విజయ్ తప్పుపట్టారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ మీద, ఆ పార్టీ అధ్యక్షుడి మీద అలాంటి వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ను ప్రజలు శిక్షించాలని పిలుపునిచ్చారు. అయితే, ఆయన ట్వీట్‌లో తెలంగాణ పదాన్ని ఇంగ్లిష్‌లో తప్పుగా రాశారు.

దిగ్విజయ్ ట్వీట్‌కు కౌంటర్‌గా రీ ట్వీట్ చేసిన ‘మొదట తెలంగాణ అనేది ఇంగ్లిష్‌లో ఎలా రాస్తారో తెలుసుకో’అని సూచించారు. అదే సమయంలో తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ చెబుతోందని.. అదేమైనా మీ జాగీరా అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే.. అందుకు కాంగ్రెస్ కూడా తలొగ్గిందన్నారు.అంతకు ముందు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా మీద కూడా ఇదే స్థాయిలో కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేటీఆర్ వల్లే తెలంగాణకు ఆపిల్ సంస్థ రాకుండా పోయిందని కుంతియా వ్యాఖ్యానించినట్టు పత్రికల్లో వచ్చిన వార్తను కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఆపిల్ సంస్థ కార్యకలాపాలను 2016లోనే ప్రారంభించిందని.. 3500 మంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. అదే సందర్భంలో కుంతియాను ఓ జోకర్‌గా అభివర్ణించారు.

First published: September 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...