Home /News /politics /

TWITTER BLOCKS OFFICIAL HANDLE OF CONGRESS RANDEEP SURJEWALA AJAY MAKEN MANICKAM TAGORE AND SUSHMITA DEV SK

Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాకిచ్చిన ట్విటర్.. పార్టీతో పాటు ఆ నేతల అకౌంట్స్ లాక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హత్రాస్ అత్యాచారం కేసులో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి బాధితురాలి ఫొటోను పోస్ట్ చేశారని.. అది కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు చర్యలు తీసుకోని ట్విటర్.. ఇప్పుడు మా ఖాతాలను ఎందుకు నిలిపివేస్తుందని నిలదీస్తున్నారు.

ఇంకా చదవండి ...
    కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ వరుస షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను లాక్ చేసిన ట్విటర్..తాజాగా ఆ పార్టీ అధికారిక ఖాతాతో పాటు పలువురు సీనియర్ నేతల అకౌంట్లను బ్లాక్ చేసింది. రణ్‌దీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్, మాణిక్కం ఠాకూర్, సుస్మిత దేవ్  ఈ జాబితాలో ఉన్నారు.  తమ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఖాతాలను నిలిపివేసినట్లు ట్విటర్ ప్రకటించింది. ఐతే ట్విటర్ తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రధాని మోదీకి అనుకూలంగా పనిచేస్తూ.. కాంగ్రెస్‌ నేతలను టార్గెట్ చేస్తోందని విరుచుకుపడుతున్నారు. గతంలో బీజేపీ నేతలు నిబంధనలను విరుద్ధంగా ఎన్నో ట్వీట్స్ చేశారని.. ఐనా వారి విషయంలో ఇలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ నేతల ఖాతాలను నిలిపివేసి.. ప్రజల కోసం పోరాడతున్న తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఢిల్లీలో దుండగుల లైంగిక దాడిలో మరణించిన 9 ఏళ్ల దళిత బాలిక కుటుంబాన్ని రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు.  బాలికకు న్యాయం జరగాలని ఆమె తల్లిదండ్రుల కన్నీళ్లు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పోరాటంలో తాను వారికి అండగా ఉంటానని తెలిపారు. ఐతే ఈ వ్యవహారంపై జాతీయ పౌర హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫొటోను సోషల్ మీడియాలలో పోస్ట్ చేసినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. జువైన్ జస్టిస్ యాక్ట్‌తో పోక్సో చట్టాలను ఆయన ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్లు అత్యాచారానికి గురైన కేసుల్లో వారి ఫొటోలు గానీ, కుటుంబ సభ్యుల వివరాలను కానీ బహిర్గతం చేయకూడదని.. అందుకే ఆయనపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని ఖాతాను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా ఇలాంటి ట్వీట్సే చేయడంతో వారి ఖాతాలను కూడా నిలిపివేసింది ట్విటర్.


    ఐతే హత్రాస్ అత్యాచారం కేసులో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి బాధితురాలి ఫొటోను పోస్ట్ చేశారని.. అది కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు చర్యలు తీసుకోని ట్విటర్.. ఇప్పుడు మా ఖాతాలను ఎందుకు నిలిపివేస్తుందని నిలదీస్తున్నారు. ట్విటర్ ద్వంద వైఖరిను శశిథరూర్‌తో పాటు పలువురు సీనియర్లు ఖండించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించకూడదా? అని మండిపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ ట్విటర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

    ఇవి కూడా చదవండి:

    India Corona Updates: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. టీకాలు  వేసుకున్నా పాజిటివ్

    Video: హైవేపై వింత ఘటన.. డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన బైక్.. అసలేం  జరిగిందంటే..
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Rahul Gandhi, Twitter

    తదుపరి వార్తలు