Badvel By Election: బీజేపీకి పవన్ బై బై చెపుతారా..? బద్వేల్ బై పోల్ లో షాకింగ్ పరిణామాలు..

పవన్ తో పొత్తుకు టీడీపీ సై

Badvel By Election: పొలిటికల్ హీట్ పెంచుతుంది అనుకున్న బద్వేల్ బై పోల్ లో ఊహించని పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తరువాత ఒకరు ఎన్నికకు దూరమవుతున్నారు. అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ కూడా ఇప్పుడు ఎన్నిక నుంచి తప్పుకుంది. ఇక జనసేన ముందే తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. కానీ మిత్రపక్షం బీజేపీ పోటీకి సై అంటోంది.. జనసేనకు టీడీపీ చేరువ అవుతుంటే.. బీజేపీ దూరమవుతోందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

 • Share this:
  Badvel By Election: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయంగా హీట్ పెంచుతుంది అనుకున్న కడప జిల్లా (Kadapa District) బద్వేలు ఉపఎన్నిక (Badvel By Election) విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కీలక నిర్ణయం తీసుకుంది. బద్వేల్‌ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్‌బ్యూరో ఆదివారమే నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఏపీలో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని నెలకొల్పింది టీడీపీయేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. దీంతో బద్వేల్‌ బైపోల్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా మొన్న జనసేన (Janasena), నిన్న టీడీపీ (TDP) రెండూ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. అయితే రెండు పార్టీలు ఒకే నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చకు తెరలేపింది. జనసేన – టీడీపీ నిర్ణయం ఒకటే అయితే.. ఇక బీజేపీ (bjp) తేల్చాల్సి ఉంది.. ఇప్పటికు బీజేపీ పోటీ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టత ఇచ్చారు. మొత్తానికి కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నిక ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణలకు వేదికైంది. మిత్రులైన బీజేపీ – జనసేన మధ్య భిన్నాభిప్రాయాలను తెరపైకి తెచ్చింది. అభ్యర్థిని ప్రకటించిన నెలన్నర తర్వాత పోటీకి దూరంగా ఉంటామన్న టీడీపీ నిర్ణయం కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ రెండు పార్టీలు ఒక్కటి అవుతున్నాయనే అనే ప్రచారం ఊపందుకుంది.

  ఎమ్మెల్యే సుబ్బయ్య మృతితో ఉప ఎన్నిక రావడం, పోటీలో ఆయన భార్య సుధ ఉండటంతో తాము పోటీ చేయడం లేదని రాజమండ్రిలో పవన్‌ కల్యాణ్ ప్రకటించారు‌. జనసేన నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ అడుగులు వేయడం కొత్త కొత్త ఊహాగానాలకు తెరతీసింది. కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకం కాబట్టే పోటీకి సిద్ధమన్నది సోము వాదన. ఏదైనా పార్టీ అధిష్టానం డిసైడ్‌ చేస్తుందని, 8వ తేదీ వరకు ఇంకెన్నో పరిణామాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు వీర్రాజు.

  ఇదీ చదవండి: ఏపీ సీఎం జగన్ మీ బంధువైతే.. “మా” ఎన్నికలకు వస్తారా? ఓటేసి గెలిపిస్తారా..?

  ఇదే సమయంలో ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది తెలుగుదేశం. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కూడా సానుభూతి కారణంతోనే వెనక్కి తగ్గింది. నెలన్నర కిందటే ఓబుళాపురం రాజశేఖర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం. ఆయన ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు ఉన్నట్టుడి వెనక్కి తగ్గడం రాజకీయ ఆసక్తిని పెంచింది.

  ఇదీ చదవండి: కోడిగుడ్ల రోల్.. 20 నిమిషాల్లో తింటే 20 వేల బహుమతి.. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి

  నామినేషన్లకు 8వ తేదీ వరకు గడువు ఉంది. ఆలోపు బీజేపీ కూడా డ్రాప్‌ అయితే ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఇంకెవరైనా పోటీ చేస్తే పోలింగ్‌ తప్పదు. ఒకవేళ బీజేపీనే పోటీ చేస్తే జనసేన మద్దతు ఉంటుందా? గ్యాప్‌ ఇంకా పెరుగుతుందా? అన్నది కొత్త కొత్త చర్చలకు దారితీస్తోంది. ఇప్పటికే జనసేన–టీడీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. రాజకీయంగా చర్చ ఉంది. టీడీపీ తాజా నిర్ణయంతో రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయనే సంకేతాలిస్తున్నాయి. బీజేపీకి –జనసేనకు దూరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ సైతం బీజేపీకి బైబై చెప్పకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పని భావిస్తున్నట్టు సమాచారం.
  Published by:Nagesh Paina
  First published: