Home /News /politics /

TWEETS WAR RUNNING BETWEEN TELANGANA CONGRESS IN CHARGE MANICKAM TAGORE AND MLC KAVITHA OVER ESTABLISHMENT OF TELANGANA PRV

Telangana: ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ కాంగ్రెస్​ ఇన్​ఛార్జి​ మాణిక్కం ఠాగూర్​ ట్వీట్స్​ వార్.. తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదంటూ కవిత ఫైర్​

మాణిక్కం ఠాగూర్​, కవిత (ఫైల్)

మాణిక్కం ఠాగూర్​, కవిత (ఫైల్)

మాణిక్కం ఠాకూర్ (Manickam Tagore) వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ (MLC Kavitha) ఇచ్చారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదన్న కవిత.. మాణిక్కం ఠాకూర్ చేసిన వ్యాఖ్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

    కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్ (Manickam Tagore) వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ (MLC Kavitha) ఇచ్చారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదన్న కవిత.. మాణిక్కం ఠాకూర్ చేసిన వ్యాఖ్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ (KCR), ప్రజా పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద‌న్నారు. అది గిఫ్ట్ కాదు.. ప్రజాగ్రహనికి తలొగ్గి స్వరాష్ట్రం ఇచ్చారని ఎమ్మెల్సీ క‌విత తేల్చిచెప్పారు. నాటీ ఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ఉద్యమం కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదన్నారు ఎమ్మెల్సీ కవిత.

    అహింసా మార్గంలో కేసీఆర్ (KCR) గారు చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మీపై ఒత్తిడి పెరగడంవల్ల తెలంగాణ ఇచ్చారు కానీ అది ఎవరి భిక్ష కాదని కవిత తెలిపారు. ప్రజా పోరాటంలో ఆఖరికి సత్యమే గెలిచిందని కవిత అన్నారు.

    అది కేసీఆర్​ గొప్పతనం..

    భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారని కవిత గుర్తు చేశారు. అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం అని ఆమె పేర్కొన్నారు. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాల‌ని ఠాగూర్‌కు క‌విత హితవు పలికారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా (Tweet war) మాణిక్యం ఠాకూర్‌పై మండిపడ్డారు.



    అయితే కవిత ట్వీట్ల (Tweets)కు మాణిక్కం ఠాగూర్​ బదులిచ్చారు. మీ తండ్రి ఆమెను తెలంగాణ తల్లి అన్నారని కానీ, ఆయన ఆ మాటలు మళ్లీ మార్చారని తెలిపారు. బీజేపీ ప్రవేశపెట్టిన చాలా బిల్లుల విషయంలో ముఖ్యంగా సీఏఏ, రఫేల్, జీఎస్టీ తదిరత బిల్లుల విషయంలో కాంగ్రెస్​ పోరాడిందని, కేసీఆర్ బీజేపీ వైపు​ రాయిలా నిల్చున్నారే కానీ వ్యతిరేకించలేదంటూ మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. నిన్న ఒక్కసారిగా మాట మార్చారంటూ ఎద్దేవా చేశారు.



    ఏం జరిగింది..?

    కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మణిక్కం ఠాకూర్ ఊసరవెల్లి అంటూ ఓ ట్వీట్ చేశారు. అంతే కాదు ఊసరవెల్లి స్పెషాలిటీ అంటూ రంగులు మార్చే ఊసరవెల్లి ఫోటోను పోస్ట్ చేశారు. గత కొద్దిరోజుల నుంచి కేసీఆర్​పై కాంగ్రెస్​ నాయకులు ఊసరవెల్లి అంటూ విమర్శలు గుప్పిస్తుండటంతో ఇది కూడా కేసీఆర్​పైనే వేశారని అంతా భావిస్తున్నారు. అంతకుముందు ఆయన చేసిన మరో పోస్ట్ లో తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ టీం కోట్లాదిమంది తెలంగాణ యువత, సోనియమ్మ కోరుకున్న తెలంగాణ కోసం పని చేస్తూనే ఉంటుందని ఆయన వెల్లడించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, Kalvakuntla Kavitha, Tweets

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు