హోమ్ /వార్తలు /రాజకీయం /

నేనే సీఈవో...టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమైన రవిప్రకాశ్

నేనే సీఈవో...టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమైన రవిప్రకాశ్

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ (ఫైల్)

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ (ఫైల్)

తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న రవిప్రకాశ్..tv9 సీఈవోగానే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. గందరగోళాన్ని తగ్గించడానికే స్టూడియోకు వచ్చి మాట్లాతున్నట్లు స్పష్టంచేశారు.

  టీవీ9 సీఈవో పదవి నుంచి తనను తప్పించారన్న ప్రచారాన్ని రవిప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమైన ఆయన..తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరూ అరెస్ట్ చేయడం లేదని స్పష్టంచేశారు. NCLT కేసు కోర్టులో ఉందని..మే 16 విచారణ జరగుతుందని ఆయన చెప్పారు. దాని ఆధారంగా తనపై తప్పుడు కేసులు బనాయించేందుకు కొందరు కుట్రలు చేశారని..అవన్నీ నిలబడబోవని తేల్చిచెప్పారు. సామాజిక సేవ కోసం టీవీ9 జర్నలిస్టులు పనిచేస్తున్నారన్న రవిప్రకాశ్...పుకార్లను నమ్మవద్దని సూచించారు.


  నాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు. కొన్ని ఛానెళ్లు తప్పుడు ప్రసారం చేశాయి. నేను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలు అవాస్తవం. నన్నెవరూ అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయబోవడం లేదు. మొన్న రాత్రి (ఈనెల 7న) నేను టీవీ 9 స్టూడియోలో ఉన్నా. నిన్న వేరే ఊరు వెళ్లడం వల్ల రావడం ఆలస్యమైంది. నేను టీవీ9 స్టూడియోలో ఉన్నా. టీవీ9 సీఈవోగా మాట్లాడుతున్నా.
  రవి ప్రకాష్
  తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న రవిప్రకాశ్..tv9 సీఈవోగానే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. గందరగోళాన్ని తగ్గించడానికే స్టూడియోకు వచ్చి మాట్లాతున్నట్లు స్పష్టంచేశారు.


  ఇది కూడా చదవండి:


  టీవీ9 రవిప్రకాష్ vs అలంద మీడియా.. ఉద్యోగుల్లో ఆందోళన


  పరారీలో టీవీ9 రవిప్రకాష్... అలంద మీడియాతో ఆయనకు ఎక్కడ చెడింది ?


  టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌తో పాటు... హీరో శివాజీ ఇంట్లో పోలీసుల సోదాలు

  First published:

  Tags: Ravi prakash, Telangana, Telangana Politics, TV9

  ఉత్తమ కథలు