కేసీఆర్‌కు మాజీమంత్రి షాకిస్తారా ?

టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవితవ్యం ఏమిటనే అంశం ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: November 14, 2019, 7:17 PM IST
కేసీఆర్‌కు మాజీమంత్రి షాకిస్తారా ?
సీఎం కేసీఆర్ (File Photo)
  • Share this:
ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన తుమ్మల నాగేశ్వరరావు... తెలంగాణ వచ్చిన తరువాత టీఆర్ఎస్‌లోనూ తన హవా కొనసాగించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆయన పొలిటికల్ కెరీర్‌కు పెద్ద దెబ్బగా మారిందని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం కూడా టీఆర్ఎస్ అధిష్టానం దగ్గర తుమ్మల ఇమేజ్ పడిపోవడానికి కారణమైందనే వాదనలు ఉన్నాయి. దీనికి తోడు తనకంటే బాగా జూనియర్ అయిన పువ్వాడ అజయ్‌ను కేసీఆర్ కేబినెట్‌లోకి తీసుకోవడం తుమ్మలకు ఏ మాత్రం మింగుడుపడటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణాలతో ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ ఉంది.

పాలేరులో తుమ్మలపై గెలిచిన కందాళ ఉపేందర్‌రెడ్డి మూణ్నెళ్లు కూడా తిరక్కుండానే తెరాస తీర్థం పుచ్చుకున్నారు. గడచిన స్థానిక సంస్థల ఎన్నికలు సహా, నిన్నమొన్నటి పార్టీ సంస్థాగత పదవుల ఎంపికలోనూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తన మార్కు వేసుకుంటూ.. తన విధేయ అనుచరగణానికి మాత్రమే పదవులు ఇస్తూ వెళ్తున్నారు. ఒక పక్క తెరాసకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉండగా.. తాను వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తుమ్మల చెబుతుండడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని వెనుక తుమ్మల వ్యూహమేంటో అర్థంకాని క్యాడర్‌ ఒకింత గందరగోళానికి గురవుతోంది.

Tummala nageshwara rao, Khammam district, trs, cm kcr, ktr, puvvada ajay, telangana, tdp, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా, టీఆర్ఎస్, కేసీఆర్, పువ్వాడ అజయ్, తెలంగాణ, టీడీపీ
తుమ్మల నాగేశ్వరరావు(ఫైల్ ఫోటో)


ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్లకు పైగా సమయం ఉన్న పరిస్థితులలో మాజీ మంత్రి తుమ్మల చేస్తున్న ఇలాంటి పర్యటనలు.. ప్రకటనల వెనుక ఉన్న మర్మమేంటన్న దానిపై రెండు జిల్లాల్లోనూ రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. తుమ్మల పార్టీ మార్పు వంటి తీవ్ర స్థాయి నిర్ణయాలు తీసుకుంటారా ? లేక సీఎం కేసీఆర్‌ ఆయనకు ఏమైనా ప్రత్యేకమైన హామీలు ఇచ్చారా అన్న కోణంలో ఊహాగానాలు సాగుతున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: November 14, 2019, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading