అమెరికా అధ్యక్ష పదవి రేసులో హిందూ మహిళ తులసి గబార్డ్

వచ్చే ఎన్నికల్లో ఆమె డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని తరచుగా వినిపిస్తున్నది. ఒకవేళ ఆమె గెలిచి అధ్యక్షులు అయితే ... తొలి హిందూ అధ్యక్షురాలు అవుతారు

news18-telugu
Updated: January 12, 2019, 4:02 PM IST
అమెరికా అధ్యక్ష పదవి రేసులో హిందూ మహిళ తులసి గబార్డ్
తులసి గబార్డ్
  • Share this:
అమెరికా అధ్యక్ష పదవికి తులసి గబార్డ్ పేరు అనూహ్యంగా తెరపైకి వస్తోంది. డెమోక్రాటిక్‌ పార్టీ ప్రతినిధి తులసి గబార్డ్‌ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2020లో ఆమె అమెరికా అధ్యక్ష పదవి చేపట్టవచ్చని భారతీయ-అమెరికన్ డాక్టర్ సంపత్ శివాంగి ప్రకటించారు. హవాయీ నుంచి అమెరికా కాంగ్రెస్‌కు తులసి నాలుగోసారి ఎన్నికయ్యారు. ఆమె గతంలో భగవద్గీత మీద పదవీ ప్రమాణం స్వీకరించారు.

అమెరికా అధ్యక్ష పదవి రేసులో తులసి గబార్డ్


అయితే అధ్యక్ష రేసులో ఉన్నామనే విషయంపై ఆమె ఇప్పటివరకు తన అభిప్రాయం వెల్లడించలేదు. వచ్చే ఎన్నికల్లో ఆమె డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని తరచుగా వినిపిస్తున్నది. ఒకవేళ ఆమె గెలిచి అధ్యక్షులు అయితే ... తొలి హిందూ అధ్యక్షురాలు అవుతారు. తులసి గబార్డ్ వయస్సు 37 సంవత్సరాలు. ఇటీవల అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు, హిందువులతో పాటు ప్రపంచ హిందూ జనాభాలో, భారతీయుల్లో ఈ పేరు బాగా నలుగుతోంది.

తులసి కర్మరీత్యా హిందువు. చైతన్య మహాప్రభు బోధించిన వైష్ణవాన్ని నిష్ఠగా ఆచరించే శుద్ధ శాకాహారి. తులసి తండ్రి అమెరికన్ సమోవా కేథలిక్, తల్లి హిందువు. అందుకే ఆమె పేరు తులసి గబార్డ్. చిన్నప్పటి నుంచి హిందువుగానే పెరిగింది. హిందూ పురాణాలు, గ్రంథాలు, కర్మలు, ఆచారాలకు సంబంధించి ఆమెకు పూర్తి అవగాహన ఉంది. దీంతో పాటు మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ కూడా. 2002లో ఎడ్వర్డో టమయోను పెళ్లిచేసుకుంది. తరువాత వ్యక్తిగత కారణాల వల్ల 2006లో వారిద్దరూ విడిపోయారు.

అమెరికా అధ్యక్ష పదవి రేసులో తులసి గబార్డ్


అప్పటి నుండి విడిగానే ఉన్న ఆమె 2015 ఏప్రిల్లో పూర్తిగా వైదిక సంప్రదాయంలో అబ్రహాం విలియమ్స్‌ను పెళ్లిచేసుకుంది. ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆమె తన హిందూ మత విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హిందువు అనే కారణంగా ఆమెను అమెరికాలో పనిచేసే, స్థిరపడిన భారతీయులు ఆమెను అధికంగా అభిమానిస్తారు. అంతేకాదు ఆమెకు కూడా భారతదేశమన్నా, భారతీయులన్నా ప్రత్యేక అభిమానం. 2014లో అమెరికాకు వచ్చిన మోడీకి ఆమె హవాయి నుంచి తెప్పించిన ఓ అల్లం పూలదండను, భగవద్గీతను బహూకరించింది.

భారతీయులకు నష్టం వాటిల్లేలా ట్రంపు తీసుకునే హెచ్ 1బి, హెచ్ 4 వీసాల ఆంక్షలనూ తులసి తప్పుపడుతోంది. ఇప్పుడు తులసి ఏకంగా 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికే పోటీపడాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల తులసి అమెరికన్ కాంగ్రెస్ తొలి హిందూ ప్రతినిధిగా ప్రమాణం స్వీకారం చేసింది. ప్రమాణ స్వీకారమప్పుడు ఈమె భగవద్గీతపైనే ప్రమాణం చేసింది. తనను తాను కర్మయోగిగా చెప్పుకునే ఆమెకు భారతదేశంలోని బృందావనం అంటే విపరీతమైన ఆరాధన, ప్రేమ, భక్తి. ఇప్పటికే ట్రంపు అమెరికా జాతీయవాదాన్ని బలంగా ప్రచారం చేసుకుంటూ సాగుతున్న స్థితిలో ఓ హిందూ మతవిశ్వాసినిని అమెరికన్ పార్టీ ప్రతినిధులు ఏ మేరకు నెగ్గుకు రానిస్తారో వేచి చూడాల్సిందే.
అమెరికా అధ్యక్ష పదవి రేసులో తులసి గబార్డ్
Published by: Sulthana Begum Shaik
First published: January 12, 2019, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading