ఏపీ ప్రభుత్వానికి టీటీడీ సొమ్ము... కేంద్రమంత్రి పేరుతో దుష్ప్రచారం

తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును ఏపీ ప్రభుత్వం ట్రెజరీకి మళ్లించిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి అజిత్ దోవల్ పేరుతో ఈ వార్త కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: February 23, 2020, 3:31 PM IST
ఏపీ ప్రభుత్వానికి టీటీడీ సొమ్ము... కేంద్రమంత్రి పేరుతో దుష్ప్రచారం
తిరుమలలో సాయంత్రం 6.20 గంటలకు సీఎం జగన్ శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
  • Share this:
సోషల్ మీడియాలో వైలర్ అవుతున్న ఓ న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును ఏపీ ప్రభుత్వం ట్రెజరీకి మళ్లించిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి అజిత్ దోవల్ పేరుతో ఈ వార్త కలకలం రేపుతోంది. దీంతో ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీపై కేంద్రమంత్రి పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రమంత్రి అజిత్ దోవల్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైవీ మండిపడ్డారు. ఇటువంటి వాటిని ప్రజలు నమ్మొద్దన్నారు. రూ.2300 కోట్లు టీటీడీ డబ్బులు ఏపీ ప్రభుత్వానికి మళ్లించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారాయన. ఇది దేవుడు సొమ్ము అన్నారు. మనకు ఇష్టం వచ్చినట్లు వాడటానికి వీలు లేదన్నారు. భక్తుల కోసం మాత్రమే ఆ డబ్బును వినియోగించాలన్నారు. ఇలాంటి వాటివి కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం దారుణమన్నారు. రాజకీయంగా ఎన్నైనా చేసుకోవచ్చని దేవుడిపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీటీడీకి త్వరలో సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి.

తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ఏర్పాటుపై చర్చిస్తున్నామన్నారు. ఈ విషయమై హైదారాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీతో కూడా సమావేశమయ్యామన్నారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏడుకొండల్లో టన్నెల్‌ తవ్వకుండా ఉన్న మార్గాల్లోనే మోనో రైలు ఏర్పాటును పరిశీలించాలని కోరామన్నారు. భక్తులకు మెరుగైన రవాణా కల్పిస్తాంమని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.
Published by: Sulthana Begum Shaik
First published: February 23, 2020, 3:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading