పైరవీల భవన్‌గా ప్రగతి భవన్: ఎల్.రమణ

కొత్త ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇతర రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాయడం సహజమే అని ఎల్. రమణ అన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: November 20, 2018, 5:00 PM IST
పైరవీల భవన్‌గా ప్రగతి భవన్: ఎల్.రమణ
ఎల్.రమణ(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: November 20, 2018, 5:00 PM IST
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రగతి భవన్‌ను కేసీఆర్ పైరవీల భవన్‌గా మార్చారని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇతర రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాయడం సహజమే అని ఎల్. రమణ అన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఆ లేఖల ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం కుమ్మక్కైన కేసీఆర్... కేంద్రంతో ములాఖత్ అయ్యారని విమర్శించారు. కేసీఆర్, మోదీ మధ్య రహస్య స్నేహం ఉందని ఆరోపించారరు. కేసీఆర్ చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని రమణ ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సికింద్రాబాద్ కార్యకర్తలతో సమావేశమైన ఎల్. రమణ... మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. పొత్తుల్లో భాగంగా అనేకమందికి పోటీ చేసే అవకాశం రాలేదని... మహాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నేతలను గుర్తింపు ఉంటుందని తెలిపారు. అంతకుముందు తన గెలుపు కోసం సహకరించాలని ఎన్టీఆర్ భవన్‌లో తనను కలిసి ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌తో ఎల్. రమణ భేటీ అయ్యారు. ఆయన విజయానికి టీడీపీ శ్రేణులు పని చేస్తాయని హామీ ఇచ్చారు.
First published: November 20, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...