కాంగ్రెస్‌కు షాకిచ్చేలా తెలంగాణ టీడీపీ నిర్ణయం

తెలంగాణలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో... టీటీడీపీతో అవగాహన కుదుర్చుకుని ముందుకు సాగాలని టి కాంగ్రెస్ నేతలు భావించారు.

news18-telugu
Updated: January 8, 2020, 5:22 PM IST
కాంగ్రెస్‌కు షాకిచ్చేలా తెలంగాణ టీడీపీ నిర్ణయం
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఏ పార్టీ పోటీ కాదని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్తిస్థాయిలో అభ్యర్థులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ టీడీపీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌కు ఇబ్బంది కలిగించే పరిణామంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో... టీటీడీపీతో అవగాహన కుదుర్చుకుని ముందుకు సాగాలని టి కాంగ్రెస్ నేతలు భావించారు. ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్యనేతలు కొందరు టీ టీడీపీ నేతలతో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వచ్చాయి.

హైదరాబాద్ శివార్లలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీ టీడీపీకి కొత్త స్థానాలు కేటాయించి... మిగతా స్థానాల్లో ఆ పార్టీ మద్దతు తీసుకోవాలని టి కాంగ్రెస్ వ్యూహరచన చేసింది. టీడీపీతో పాటు చాలా చోట్ల వామపక్షాలను కూడా కలుపుకుని ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించుకోవడంతో... ఈ ప్రభావం విపక్ష కాంగ్రెస్‌పై ఎంతోకొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First published: January 8, 2020, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading