థర్టి ఇయర్స్ పృథ్వీకి షాక్... విచారణకు వైవి సుబ్బారెడ్డి ఆదేశం

ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు.

news18-telugu
Updated: January 12, 2020, 3:10 PM IST
థర్టి ఇయర్స్ పృథ్వీకి షాక్... విచారణకు వైవి సుబ్బారెడ్డి ఆదేశం
SVBC చైర్మన్‌గా కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
ఎస్వీబీసీ ఛైర్మన్, ప్రముఖ కమెడియన్ పృథ్విరాజ్‌కు షాక్ తగిలింది. ఇప్పటికే టీటీడీ ఉద్యోగినితో ఆయన రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ వైబీ సుబ్బారెడ్డి స్పందించారు. సాయంత్రం లోగా టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆడియో టేపు వ్యవహారంపై పృథ్వితో కూడా ఆయన మాట్లాడానన్నారు. అయితే ఓ వర్గం తనను టార్గెట్ చేసిందని పృథ్వీ తనతో చెప్పారన్నారు వైవీ సుబ్బారెడ్డి. నివేదిక వచ్చాక తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. దీంతో పృథ్వి మెడకు ఈ విషయం చుట్టుకోవడం ఖాయమంటున్నారు టీటీడీ అధికారులు. అత్యంత పవిత్రంగా భావించే పుణ్య స్థలం తిరుమల అరాచక శక్తులు ప్రవేశించాయని మండిపడుతున్నారు టీటీడీ మాజీ సభ్యుడు ఎస్వీ రమణ. ఒక కుట్ర ప్రకారం తిరుమలని అపవిత్రం చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుందన్నారు. టీటీడీ వేదికగా నీచమైన పనులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల ప్రతిష్ట దిగజారే నిర్ణయాలే కాకుండా ఇప్పుడు ఏకంగా టీటీడీ వసతి గృహాలను ఎస్వీబిసి ఛైర్మెన్ తన రాస క్రీడలకు అడ్డాగా మార్చుకోవడం దారుణమన్నారు ఎస్వీబీసీ సిబ్బంది. తిరుమలని అపవిత్రం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాల్లో మార్పు లేకపోతే భక్తకోటి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్ వ్యవహారం టీటీడీలో కలకలం రేపుతోంది.
Published by: Sulthana Begum Shaik
First published: January 12, 2020, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading