తిరుమలలో దుమారం రేపుతున్న బోర్డు మెంబర్ వ్యవహారం...

తిరుమల (ప్రతీకాత్మక చిత్రం)

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి వైద్యనాథన్ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలో ఫ్రైవేట్ హోమం నిర్వహించారు.

  • Share this:
    తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి వైద్యనాథన్ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలో కేవలం బోర్డు ఆధ్వర్యంలోనే పూజలు నిర్వహించాలి. తిరుమలలోనే కాదు, టీటీడీ బోర్డు పరిధిలో ఉండే అన్ని ఆలయాల్లో కూడా కేవలం ట్రస్ట్ బోర్డు మాత్రమే ఎలాంటి హోమాలైనా నిర్వహిస్తుంది. అయితే, తిరుమల కొండ మీదే కపిలతీర్ధం వద్ద బోర్డు సభ్యుడు వైద్యనాథన్ ప్రైవేట్ హోమం (రుద్ర జప హోమం) నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 60 మంది రుత్వికులను తీసుకొచ్చి ఈ ప్రైవేట్ హోమం నిర్వహించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసిందిి.. హోమం జరుగుతున్న సమయంలో ఇతరులు ఎవరికీ అక్కడ ప్రవేశం కల్పించలేదు. కేవలం కృష్ణమూర్తి కుటుంబసభ్యులు, ఆయన బంధువులను మాత్రమే అనుమతించినట్టు తెలిసింది. సాక్షాత్తూ తిరుమల కొండ మీద ప్రైవేట్ హోమం నిర్వహించడం టీటీడీలో చర్చనీయాంశంగా మారింది.

    కపిలేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రైవేట్ హోమం నిర్వహణపై టీటీడీ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం స్పందించారు. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో సాధారణ భక్తులు కూడా ఇలా ప్రైవేట్ హోమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించగా ‘అందరికీ అనుమతి ఉండదు. కేవలం టీటీడీ పెద్దలకు మాత్రమే ఉంటుంది.’ అని చెప్పారు. అయితే, మొత్తం మానవాళి క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ హోమం నిర్వహించామని కృష్ణమూర్తి వైద్యనాథన్ తెలిపారు. అయితే, ఈ హోమం తన అత్తమామల ఆయుష్షుకోసం నిర్వహించినట్టు తెలిసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: